ఫ్యాన్స్‌ని డీప్ గా హర్ట్ చేసిన అనుష్క… ఇలా చేస్తుందని అస‌లు ఊహించలేదుగా..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది అనుష్క శెట్టి. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతిలో నటించి తన నటనతో హీరోలతో సమానంగా తన క్రేజను పెంచుకుంది. ఆ సినిమా దగ్గర నుంచి అనుష్క ఇండస్ట్రీలో వెను తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తుంది.

అనుష్క బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలు విషయం పక్కనపడితే అనుష్కకు నాలుగు పద్దుల వయసు దాటుతున్న ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు. తన తోటి హీరోయిన్లందరూ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతుంటే అనుష్క మాత్రం ఇప్పటికే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పడం లేదు. అయితే గత కొంతకాలంగా అనుష్క- ప్రభాస్ ప్రేమలో ఉన్నారంటూ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అందుకే ఈ ఇద్దరు పెళ్లికి దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

Anushka Shetty talks about working with Prabhas again, breaks silence on  viral wedding photo

అయితే అలాంటి వార్తలో నిజమేమీ లేదంటూ కేవలం మా మధ్య మంచి స్నేహం మాత్రమే ఉంది అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే వారు అంత క్లారిటీ ఇచ్చిన వారి పెళ్లికి సంబంధించిన వార్తలు రావడం మాత్రం ఆగటం లేదు. అయితే ఇప్పుడు తాజాగా అనుష్క ఓ యంగ్ హీరో ప్రేమలో పడింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే యంగ్ హీరోతో ప్రేమ అంటే మీరు నిజ జీవితంలో అనుకున్నారు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఓ సినిమాలో భాగంగా అనుష్క యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో ప్రేమలో ఉన్నట్టు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా మొదలైంది.

Naveen Polishetty to share screen space with Anushka Shetty in director  Mahesh Babu's film - India Today
అయితే ఈ సినిమా షూటింగ్లో అనుష్క కూడా తాజాగా పాల్గొంటున్నట్టు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో తనకంటే వయసులో చిన్నవాడుతో ఆమె ప్రేమలో పడుతుంది. ఈ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనుష్కకు ఏ స్థాయిలో సక్సెస్ ఇస్తుందో చూడాలి. చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నా అనుష్క మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతుంది.