సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న నటులు వీరే..

సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది సినిమాల ద్వారానే కాకుండా ప్రకటనల ద్వారా కూడా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుని వివిధ రంగాలో పెట్టుబడి పెడుతున్నారు. అలా ఆస్తి సంపాదనలో వ్యాపారులతో పోటీ పడుతున్నారు. మరి సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తులు ఉన్న హీరోలు ఎవరో బుక్ చేద్దాం.

మమ్ముట్టి

మలయాళ ఇండస్ట్రీలో మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న మమ్ముట్టి మొత్తం రూ.340 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం. మలయాళ కమ్యూనికేషన్‌లో ఛైర్మన్‌గా ఉండటంతో పాటు సొంత ప్రొడక్షన్ బ్యానర్ కూడా ఉంది.

* మోహన్ లాల్

ఈ మలయాళ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇతనికి రూ.376 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం. ఈయన కేవలం నటన రంగం లోనే కాకుండా ఫుడ్స్, హాస్పిటల్స్, ఫైనాన్స్ రంగంలో భారీగా డబ్బు సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇక తన సొంత చలన చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థల మ్యాస్ ల్యాబ్ ఎంటర్టైన్మెంట్స్ ని ప్రారంభించారు.

కమల్‌ హాసన్

కమల్‌ హాసన్ దాదాపు అని భాషలో నటించి ప్రేక్షకులను అలరించాడు. తమిళ హీరో అయిన కమలహాసన్ ఇటీవలే నటించిన విక్రమ్ సినిమా మంచి విజయం సాధించింది. ఇక కమల్ ఆయన తదుపరి సినిమా కి రూ.150 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటారట. అయితే ప్రస్తుతం కమల్‌ హాసన్ ఆస్తుల విలువ రూ.388 కోట్లు ఉన్నట్లు సమాచారం.

రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన తన నెక్స్ట్ సినిమా అయిన ‘జైలర్’ కోసం రూ.150 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్తుల విలువ రూ.430 కోట్లు. చెన్నై పరిసర ప్రాంతాల్లో రజినీకాంత్ కి రూ.35 కోట్ల విలువైన పెద్ద బంగ్లా ఉంది.

నాగార్జున

నాగార్జున నటుడిగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా సంపాదిస్తున్నాడు. ఈ హీరో నెట్‌ వర్త్ ఏకంగా రూ.950 కోట్లు అట. రెస్టారెంట్ బిజినెస్‌లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని చుట్టుపక్కల ఆస్తులను కొనడం ద్వారా ఈ సంపద పోగేసాడని టాక్. ఈ టాలీవుడ్ కింగ్‌కి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో రూ.42.3 కోట్ల ఖరీదైన ఒక బంగ్లా కూడా ఉందట.

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి జూబ్లీహిల్స్‌లో రూ.28 కోట్లు విలువైన ఒక విల్లా ఉంది. ఈ హీరో మొత్తం ఆస్తుల విలువ రూ.1,650 కోట్లు అని టాక్.