అవ‌తార్ 2 బీభ‌త్సం.. ఇండియా వైడ్‌గా 2 రోజుల్లో ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

అవ‌తార్ 2 – ద వే ఆఫ్ వాట‌ర్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా డిసెంబ‌ర్ 16న అట్ట‌హాసంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. 13 ఏళ్ల క్రితం వ‌చ్చి ఎన్నో సంచ‌ల‌న రికార్డుల‌ను నెల‌కొల్పిన `అవ‌తార్‌`కు ఇది సీక్వెల్. జేమ్స్ కేమరూన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సామ్ వర్థింగ్టన్, జో సల్దాన, సిగొర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్ లెట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అవ‌తార్ లో పండోరా అందాల‌ను చూపించిన జేమ్స్.. సీక్వెల్ లో నీటి అడుగున అందాలు, భారీ సముద్ర జీవులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తోంది. దీంతో ఈ చిత్రం ప్ర‌ప‌వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది.

ఇండియాలోనూ ఈ చిత్రం బీభ‌త్సం సృష్టిస్తోంది. మొద‌టి రోజు ఇండియాలో మొత్తం మీద రూ. 52.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబ‌ట్టి దుమ్ము దుమారం లేపిన అవతార్ 2 సినిమా.. రెండో రోజు కూడా ఎక్స్ లెంట్ గా క‌లెక్ట్ చేసింది. రెండో రోజు 55.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అద‌ర‌గొట్టేసింది. అలాగే ఇండియాలో రెండో రోజు రూ. 44.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ద‌క్కించుకుంద‌ని అంటున్నారు. ఇక ఏరియాల వారిగా అవ‌తార్ 2 రెండు రోజుల టోట‌ల్‌ గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

నార్త్ ఇండియా – 49.60 కోట్లు
ఏపీ+తెలంగాణ – 24.50 కోట్లు
త‌మిళ‌నాడు – 13.20 కోట్లు
కార్ణాట‌క‌ – 14.45 కోట్లు
కేర‌ళ – 5.85 కోట్లు
—————————————–
టోట‌ల్ ఇండియా – 107.60 కోట్లు గ్రాస్‌
—————————————–