బాబు…పవన్ లేకుండా కష్టమే!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఎప్పటికప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు చేసే  రాజకీయంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది..అలాగే ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉంటున్నారు…మళ్ళీ ప్రజలు మద్ధతు తమకే ఉందని వైసీపీ భావిస్తుంది…లేదు లేదు ఈ సారి ప్రజలు వైసీపీని నమ్మరని టీడీపీని గెలిపిస్తారని…ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అటు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.

అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న…ఈ సారి మాత్రం ఎన్నికలు కాస్త హోరాహోరీగానే జరిగేలా ఉన్నాయి. కానీ కొద్దో గొప్పో వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తుందని పలు సర్వేల్లో తెలుస్తోంది. చాలాచోట్ల టీడీపీ ఇంకా పుంజుకోలేదని విశ్లేషణలు వస్తున్నాయి. ఇదే సమయంలో నెక్స్ట్ జనసేనతో టీడీపీ జతకడితే కాస్త వైసీపీని ఎదురుకోవడానికి ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. లేదంటే రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే వైసీపీకి లాభమే తప్ప…నష్టం లేదని అంటున్నారు.

Pawan Kalyan meets Chandrababu Naidu, Telugu media goes batshit crazy | The News Minute

కానీ పొత్తు విషయంలో రెండు పార్టీల ఆలోచన కాస్త వేరుగా ఉంది. ఎవరికి వారే తమకు సత్తా ఎక్కువ ఉందని ఊహించుకుంటున్నాయి. జనసేన సపోర్ట్ లేకపోయిన…సింగిల్ గా గెలిచే సత్తా తమకు ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. సింగిల్ గా పోటీ చేసి..కొన్ని సీట్లు సాధించి…పవన్ కింగ్ మేకర్ గా నిలుస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

ఎవరికి వారే తమ బలాన్ని ఎక్కువగా ఊహించుకోవడం తప్ప…సింగిల్ గా మాత్రం సత్తా చాటే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఇటీవల జరుగుతున్న పలు సర్వేల్లో టీడీపీ-జనసేన కలిస్తేనే వైసీపీని ఎదురుకోవచ్చని ఓటర్ల నుంచి సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అలా జరగకపోతే మళ్ళీ వైసీపీ విజయం సాధిస్తుందని అంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్తితుల్లో పవన్ కంటే బాబుకే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది…ఇంకో సారి గాని అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు…కాబట్టి పవన్ అవసరమే బాబుకు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. మరి చూడాలి బాబు-పవన్ కలుస్తారో..లేక విడిగా పోటీ చేస్తారో.