వామ్మో.. హీరో నితిన్ ప్రేమ వ్యవహారం ఇంత రహస్యంగా సాగిందా.. తెలిస్తే షాక్.!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరోలలో హీరో నితిన్ కూడా ఒకరు. ఈయన తన కెరీర్ మొదట్లో దిల్, సై, జయం వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ కాలక్రమమైన తన సినిమాలు పూర్తిగా డిజాస్టర్ పాలవుతూ ఉండడంతో అడపా దడపా సినిమాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో నితిన్ సినీ ఖాతాలో ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ కూడా పడలేదు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా నితిన్ వ్యక్తిగత విషయానికి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే ఆయన తన భార్య షాలిని నీ ప్రేమించడంలో ఎంత ఇబ్బందులు పడ్డారో అన్న విషయం బాగా వైరల్ గా మారుతుంది.Coronavirus scare forcing Nithiin's family to cancel his destination wedding? - IBTimes India

నిజానికి నితిన్ ..షాలిని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు . వీరు హైదరాబాదులో ఉన్నా లేదా విదేశాలలో తిరిగినా సరే అందుకు సంబంధించిన ఫోటోలను కానీ వీడియోలను కానీ సోషల్ మీడియాలో ఎక్కడ లీక్ కాకుండా నితిన్ జాగ్రత్తలు తీసుకుంటారు. నిజానికి నితిన్ హీరో కావడం చేత షాలిని నీ ఎప్పుడూ కూడా బయట ఎక్కువగా తిప్పేవారు కాదట. ఇక ఈ విషయంలో మాత్రం షాలిని మాట కూడా వినేవారు కాదట నితిన్. హైదరాబాద్లో ఇటు విదేశాలలో ఎక్కడ తిరిగినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలు తమ దగ్గర భద్రంగా ఉన్నాయని.. ఎక్కడా కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదని తెలిపారు నితిన్.

ఇకపోతే వీరిద్దరూ వివాహం చేసుకోక ముందు హైదరాబాద్లో ఉన్న ఒక ప్రముఖ హోటల్ పైన చిన్న పెంట్ హౌస్ ఉండేదని , ఆ చిన్న రెస్టారెంట్ లోనే వీళ్ళిద్దరూ కలుసుకునే వాళ్ళమని తెలిపారు. ఇక ఎట్టకేలకు మీడియా కంట పడకుండా చాలా రహస్యంగా తన ప్రేమను మెయింటైన్ చేసిన నితిన్ , షాలిని ని వివాహం చేసుకున్నారు. ఇక ఈమె గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆరాటపడ్డారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఆమెకు సోషల్ మాధ్యమాలలో అకౌంట్ లేకపోవడమే ఆశ్చర్యకరం. ప్రకాశం జిల్లాలో జన్మించింది. చిన్నతనంలోనే ఈమె ఫ్యామిలీ అంతా హైదరాబాదుకు వచ్చారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె లండన్ కి వెళ్లిపోయింది . ఇక తర్వాత ఎంబీఏ పూర్తి చేసి ఒక MNC కంపెనీలో హెచ్ఆర్ గా ఉద్యోగం చేసింది. 8 సంవత్సరాలగా నితిన్ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత వివాహం చేసుకుంది.