అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో […]

టీడీపీని నడిపించే నేతలే లేరా…..!?

తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇంకా చెప్పాలంటే పార్టీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడా అనే మాట ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముుఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిదంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ […]

జగన్ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా….!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును దగ్గరగా పరిశీలించిన వారికే తెలుస్తుందంటారు. ఆయన మాట చెబితే చేసి తీరుతాడనేది ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. నవరత్నాల పేరుతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్… ఎన్నికైన తొలి ఏడాదిలోనే 98 శాతం హామీలు అమలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనను నమ్మిన వారికి పెద్ద పీట వేసిన జగన్… తనను ఎదిరించిన వారికి కూడా అదే స్థాయిలో […]

లోకేశ్ ఢిల్లీలోనే ఎందుకున్నట్లు… వస్తే ఏమవుతుంది….!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడున్నారు…. ఆయన కూడా అరెస్ట్ అవుతారా… లోకేశ్ పారిపోయారా… ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట ఇదే. ఓ వైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిదంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు రోజుల పాటు సుధీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయనను రాజమండ్రి […]

నారా లోకేశ్ ట్వీట్… క్యాడర్‌లో డైలమా…!

ఓ వైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. అసలు అవినీతి జరగలేదని పైకి చెబుతున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉందనేది పార్టీలో నేతల గుసగుసలు. మేము నిజాయతీ అని పైకి చెబుతున్నప్పటికీ… కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో సగటు కార్యకర్త పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీడీపీ యువనేత పెట్టిన ఓ ట్వీట్.. అటు పార్టీలో ఇటు క్యాడర్‌లో కూడా […]

టీడీపీలో విచిత్ర పరిస్థితి… అధినేతకు తలనొప్పి…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. అందుకు ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. అటు ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు… ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం పొంతన లేకుండా పోయింది. రాబోయే ఎన్నికల్లో […]

ఢిల్లీలో లోకేష్..నో యూజ్?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు పవన్ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. టి‌డిపి-జనసేన కలిసి పనిచేయనున్నాయని ప్రకటించారు. ఇక పొత్తు ప్రకటనతో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. టి‌డి‌పితో పాటు జనసేన టార్గెట్ గా విరుచుకుపడుతుంది. ఇక వైసీపీకి కౌంటరుగా టి‌డి‌పి, జనసేన కూడా రాజకీయం చేస్తున్నాయి. ఇదే సమయంలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో సీన్ మరింత మారింది. అయితే ఢిల్లీకి వెళ్ళి లోకేష్..అక్కడ […]

జైలు సాక్షిగా కుదిరిన పొత్తు… పంపకాలపై క్లారిటీ వచ్చినట్లేనా….?

ముసుగు తొలగింది… ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి కానీ… అది ఉంటుందా.. ఉండదా… పొత్తులపై ప్రకటన ఎప్పుడూ అనే మాట మాత్రం సస్పెన్స్‌గా మారింది. కొందరైతే… పొత్తు కుదిరింది… సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఒకరు… కాదు కాదు… పవన్ డిమాండ్లను టీడీపీ పరిశీలిస్తోందని మరొకరు… పదవులపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఒకరు… ఇలా పలు పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే టీడీపీ – […]

యువగళం పాదయాత్రకు బ్రేక్… జగన్‌కు కావాల్సింది ఇదేనా…..!

యువగళం పేరుతో 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పటికే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. తొలి రోజుల్లో కాస్త చప్పగా సాగిన పాదయాత్ర…. ఇప్పుడు మాత్రం జోరుగా సాగుతోంది. 200 రోజులు పూర్తి […]