ఆర్‌సి 16.. కీలకపాత్రలో నటించనున్న సీనియర్ స్టార్ హీరో.. అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ సోలోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ తుదిద‌శ‌కు చేరుకోవడంతో రామ్ చరణ్ తన 16వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ram Charan and Janhvi Kapoor: Continuing On-Screen Legacy After Sridevi and  Chiranjeevi in – Firstpost

బుచ్చిబాబు డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతూనే ఉంది. ఇక స్పోర్ట్స్ డ్రామాగా వ‌స్తున్న ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో విలన్ గా నటించబోతున్నాడు అంటూ.. ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పారి పాపులారిటీ దక్కించుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో విల‌న్‌గా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నంలో ఉన్నాడు రాజశేఖర్.

Health Update: Dr Rajasekhar is recovering from the illness, says hospital  | Telugu Movie News - Times of India

ఇక ఈ సినిమా సక్సెస్ అందుకుంటే ఇండస్ట్రీలో విలన్ గా మంచి గుర్తింపు వస్తుందని.. దీంతో అవకాశాలు అందుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నాడట రాజశేఖర్. అయితే ఆయ‌న‌ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఓ కీల‌క‌ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో రాజశేఖర్ కు కూడా ఊహించిన రేంజ్ లో గుర్తింపు రాలేదు. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన సెట్ కాలేకపోయారు. ఇప్పుడు విలన్ పాత్ర వేసి ప్రేక్షకులు మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో అయినా సక్సెస్ సాధించి వరుస అవకాశాలను అందుకోవాలని భావిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.