సాయి పల్లవి తనకు వచ్చే రెమ్యూనరేషన్ తో.. ప్రతిసారి మొదటిగా ఆ పనే చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ కూడా రెమ్యూనరేషన్ ని హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆఫ్ కోర్స్ డబ్బు కోసమే అందరూ పని చేస్తారు. డబ్బు లేకుండా ఊరికే వర్క్ చేయమంటే ఎవరు చేస్తారు చెప్పండి. అదికూడా ఈ కలి యుగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయరు. ఎంత పద్ధతిగా ఉండే ముద్దుగుమ్మైనా సరే డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవి కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది .

సాయి పల్లవి సినిమాలకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోరు . తన పాత్రకు తగ్గ పారితోషకం మాత్రమే తీసుకుంటుంది . ఇన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి అటువంటి డిమాండ్ చేయదు . అయితే సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ ఏం చేస్తుంది అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ చేతికి రాగానే ఫస్ట్ టైం బాబాకు డొనేట్ చేసేస్తుందట . అది ఎప్పుడైనా సరే బాబాకి చందాగా ఇచ్చేస్తుందట . ఆ తర్వాత మిగిలిన రెమ్యూనరేషన్ ని అమ్మకి ఇచ్చేస్తుందట.

తనకు ఏదైనా డ్రెస్ కావాలి అనుకున్న ఏమన్నా కొనుక్కోవాలి అనుకున్నా తల్లిదగ్గర నుంచే తీసుకుంటుందట. ఇప్పటికీ సాయి పల్లవి అదే విధంగా చేస్తుందట. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఈరోజుల్లో నీలాగా ఎవ్వరూ లేరు యు ఆర్ రియల్లీ గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. ప్రజెంట్ సాయి పల్లవి టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ సినిమాలతో బిజీగా ముందుకు వెళ్ళిపోతుంది. టాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తుంది . అదేవిధంగా బాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది .. ఇక కోలీవుడ్లో కూడా ఆమె రెండు సినిమాల్లో నటిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా సాయి పల్లవి ముందుకు వెళ్తుంది..!!