వాళ్లపై విరుచుకుపడ్డ తారక్.. అంత కోపానికి కారణం ఏంటంటే..?!

రాజమౌళి డైరెక్షన్‌లో తరికేక్కి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరే సినిమాతో వెండితెరపై క‌నిపించ‌లేదు. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు తార‌క్‌. ప్రస్తుతం తన ఫోకస్ అంత ఈ సినిమా పైన పెట్టారు. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసింది. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సి ఉండగా.. అక్టోబర్ కు వాయిదా వేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ తుది దశ‌కు వచ్చింది.

War 2' actor Jr NTR flaunts Rs 7.5 crore watch as he arrives in Mumbai for  shoot - watch video

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న‌ వార్‌ సినిమాకు సీక్వెల్ గా వార్‌2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ ఓ కీలక పాత్రలో నటించనున్నాడు. దీనికోసం తాజాగా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు తారక్. యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్ బ్యానర్ లో వార్ మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా సీక్వెల్ కూడా తెర‌కెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరితో ఒకరు పోరాడే పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ సినిమాలోకి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది.

After a Day Off, Jr NTR Returns to Mumbai for War 2, Ready to Bounce Back  in Full Swing - Watch

వచ్చే ఏడది ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. తాజాగా నెటింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎన్టీఆర్ వైట్ షర్ట్ ధరించి అట్రాక్టివ్ లుక్ లో కనిపించాడు. ఆయన వెంట ఫోటోగ్రాఫర్లు పడుతూ ఉండడంతో.. ఒక్కసారిగా అసహనానికి గురైన తారక్ యాయ్ అంటూ పైరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక మరికొన్ని రోజులు ఎన్టీఆర్ ముంబైలోనే ఉంటారని సమాచారం. లుక్ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకుంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఇలా కెమెరా పర్సన్స్‌ను అరవాల్సి వచ్చిందని తెలుస్తుంది.