పిల్లల్ని కనడం పై సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. అలా అనేసావ్ ఏంటి మృణాల్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మృణాల్‌ ఠాగూర్.. సీతారామంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకోవడం తో పాటు సీతామహాలక్ష్మి ఫ్రెండ్స్ నూర్జహాన్ పాత్రల్లో అదరగొట్టింది. ఆ తర్వాత మృణాల్‌కు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. సీతారామం తర్వాత నేచురల్ స్టార్ నానితో జాతకట్టిన ఈ అమ్మ‌డు హాయ్ నాన్న సినిమాతో మరోసారి సక్సెస్ అందుకున్ని గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది.

విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడమే కాదు.. ఈ రెండు సినిమాల తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ అమ్మడుకు టాలీవుడ్ లో బడా ఆఫర్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్‌ చేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. పిల్లల్ని కనడం పై ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్, లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఏది ఎప్పుడు ఎలా చేయాలో ముందు తెలుసుకోవాలి.

రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా కష్టమని నాకు తెలుసు. మనల్ని అర్థం చేసుకునే పార్టనర్ రావడం ముఖ్యం. అలాగే నేను ఎగ్ ఫ్రీజింగ్ గురించి కూడా ఆలోచిస్తున్నా అంటూ మాట్లాడింది. ప్రస్తుతానికి కెరీర్ పైనే నా దృష్టి ఉంది. ఇక ఓ స్టేజ్ తర్వాత తమ్మ అండాలను నిల్వ చేసి వాటితో పిల్లలు కనడం ఇప్పుడు కామన్ గా మారిపోయిందని.. ఇక‌ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నా.. కానీ ఇప్పట్లో బిడ్డను కనే ఆలోచన లేదంటే షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మృణాల్‌ కామెంట్స్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. మృణాల్‌ కూడా అందరి హీరోయిన్స్ లాగే ఆలోచిస్తుందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.