బాలకృష్ణ ఓ సైకో.. సంస్కారం లేదంటూ.. స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..?!

నందమూరి నాట సింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు కొంతమంది విరోధులు కూడా ఉన్నారు. ఆయన ప్రవర్తన మీద ఎన్నో ఆరోపణలు, అనాలోచితంగా కామెంట్స్ చేస్తారంటూ.. కోపంగా ఉంటారంటూ.. ఎన్నో రకాల కామెంట్స్ అపుడ‌ప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆయన సైకో అనడం నెటింట చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ల‌లో ఒకరైన కె.ఎస్.రవికుమార్‌కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన బాలకృష్ణతో కూడా పలు సినిమాలను తెరకెక్కించారు.

 

రజినీకాంత్, కమలహాసన్ లాంటి కోలీవుడ్‌ టాప్ హీరోలకు బ్లాక్ బస్టర్లు అందించిన రవికుమార్.. నందమూరి బాలకృష్ణ తో పలు సినిమాలను తెరకెక్కించి హిట్లు అందుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఈయన మాట్లాడుతూ బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య ఓ సైకోలా మారారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఓ ఘటన బాలయ్య మీద మనసు విరిగిపోయేలా చేసిందంటూ చెప్పుకొచ్చాడు. సాగర సంగమం భారీ సక్సెస్ అందుకోవడంతో.. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న తారక రామారావు తన కొడుకు బాలయ్యతో కూడా ఓ సినిమాను చేయమని కే. విశ్వనాథ్‌ని కోరారట. ఆయన అన్న గారి కోరికను తీర్చేందుకు జనని జన్మభూమి టైటిల్ తో బాల‌య్య‌తో సినిమా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేశారు.

ఈ సినిమాలో కె.ఎస్.రవికుమార్ అసోసియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బాలయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడిందని.. జననీ జన్మభూమి షూటింగ్ డైరెక్టర్ రవికుమార్ ఇంటికి దగ్గరలోనే జరిగిందని వివ‌రించాడు. వయసులో ఉన్న బాలయ్య చాలా సరదాగా ఉండే వారిని.. అందరితో కలిసి పోయే వాడ‌ని.. రాను రాను బాలకృష్ణ ఓ సైకోల మారిపోయాడు అంటూ జన‌ని జన్మభూమి షూటింగ్‌టైంలో ఓ అభిమానిని ఆయన కొట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకరోజు కొందరు అభిమానులు బాలయ్యను కలిసేందుకు వచ్చారని.. ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిల్చోని ఫోటోలు దిగుతున్నారని.. వారిలో ఒక అభిమాని బాలయ్య భుజం మీద చేయి వేశాడని.. దాంతో బాలయ్య సదరు అభిమానిని కొట్టాడంటూ వివరించాడు.

ఈ ఘటన తర్వాత నాకు ఆయనపై మనసు విరిగిపోయిందని.. అతను ఒక సైకో.. సంస్కారం లేనివాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తిరిగి ఆ వ్యక్తి నిన్ను కొడితే నీ పరువు ఉంటుందా అని కేఎస్ రవికుమార్ ప్రశ్నించాడు. గతంలో కూడా బాలయ్య పై కె.ఎస్.రవికుమార్ ఎన్నో ఆరోపణలు చేసి వైరల్ గా మారాడు. నవ్వాడని తన అసిస్టెంట్ ని బాలకృష్ణ కొట్టబోయాడు.. నేనే ఆయనను ఆపాను అంటూ గతంలో ఓ సినిమా ప్రమోషన్స్ లో ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కె ఎస్ రవి కుమార్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారడంతో బాలయ్య ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. ఉన్నవి లేనివి క్రియేట్ చేసి ఆయనపై నెగెటివిటీ పెంచితే బాగోదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.