చంద్ర‌బాబు ఈక్వేష‌న్‌కు చెక్‌పెట్టి…. జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని గెలిపిస్తోన్న ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ … !

ఏపీలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఒకటి. వైసీపీ ఆవిర్భవించాక ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ జెండా ఎగరలేదు. గత రెండుసార్లు ఇక్కడ వైసిపి ఓడిపోయింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ సీటుపై వైసీపీ జెండా ఎగరేయలన్న పట్టుదలతో జగన్ మంత్రి విడుదల రజ‌నీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీలోకి దింపారు. చాలా బలమైన ఈక్వేషన్లు సెట్ చేసి మరి జగన్ రజనీని టిడిపి కంచు కోటలో పోటీకి పెట్టినట్లు తెలుస్తోంది. పశ్చిమ నియోజకవర్గంలో రజ‌ని ఎంట్రీ ఇవ్వడంతోనే చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. ర‌జ‌నీ ఎంట్రీతో ఇక్కడ రాజకీయ పరిణామాలు కూడా ఆసక్తిగా మారుతున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో చిలకలూరిపేటలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన రజ‌ని టిడిపి దిగ్గజ‌నేత‌.. అప్పుడు క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ప్రతి పార్టీ పుల్లారావును ఓడించి జయింట్ కిల్లర్‌గా రికార్డ్ సృష్టించారు. అదే టైంలో రెండేళ్ల క్రితం జరిగిన ప్రక్షాళనలో ఏకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి సొంతం చేసుకుని చిన్న వయసులోనే మంత్రి అయిన బీసీ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. తాజాగా జగన్ సైతం హీరో అనే పదం మగవాళ్లకు సరిపోతుంది కానీ… ఆ పదానికి రజన‌మ్మ‌ కచ్చితంగా అర్హురాలు అని ప్రశంసించారు అంటే ర‌జనీ క్రేజ్‌, ఆమె రాజకీయం ఏ స్థాయిలో ఉంటుందో ? దానిని జగన్ ఏ స్థాయిలో ఇష్టపడుతున్నారో చెప్పకనే చెప్పినట్లు అయింది.

టీడీపీ ఈక్వేష‌న్ చిత్తేనా…?
తాజాగా పశ్చిమ నియోజకవర్గం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూడా ర‌జ‌నీకి ధీటుగా సామాజిక సమీకరణల అస్త్రంతో గల్లా మాధవిని పోటీలోకి దింపింది. అయితే రజ‌నీ చాప కింద నీరులా దూసుకుపోతూ ఇక్కడ టిడిపికి చుక్కలు చూపిస్తుందని చెప్పాలి. రజని బీసీల్లో బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మహిళ… ఆమె భర్త విడ‌దల కుమారస్వామి నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పశ్చిమ నియోజకవర్గంలో 35 వేల కాపు సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. ఇటు బీసీ ఓట‌ర్లు కూడా గణనీయంగా ఉన్నారు. మైనార్టీలు 24000 – ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువే ఉన్నారు.

చంద్రబాబు రజనీపై సేమ్ బీసీ మహిళ అస్త్రం వాడినా ఇక్కడ రజ‌నీ చాలా తెలివిగా సామాజిక వర్గాల ఓట్లను విభజిస్తూ తన వైపునకు తిప్పుకుంటున్న పరిస్థితి. రజిని భర్త కాపు వర్గం కావడంతో ఆయన చేస్తున్న వర్క్‌తో మెజార్టీ కాపుల ఓట్లు రజనీకే పడే ఛాన్సులు ఉన్నాయి. దీనికి తోడు గుంటూరు పార్లమెంటు నుంచి వైసీపీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారు వెంకట రోశ‌య్య పోటీ చేస్తున్నారు. పైగా ఉమ్మ‌డి జిల్లాలో వైసిపి ఏకంగా ముగ్గురు కాపు నేతలకు సీట్లు ఇచ్చింది. ఎంపీ సీటుతో క‌లుపుకుంటే నాలుగు ఇచ్చిన‌ట్టే. ఇవన్నీ కాపు వర్గం ఓట‌ర్ల‌లో పశ్చిమంలో రజినీ వైపు మల్లేందుకు దోహదపడుతున్నాయి.

నియోజకవర్గంలో 24 వేలకు పైగా ఉన్న మైనార్టీ బోట్లు వన్ సైడ్ గా రజిని వైపే ఉన్నాయి ఇక వైసీపీకి సంప్రదాయంగా ఉండే ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం పొట్లలో ఏకంగా 80% వరకు రజనీకి పడనున్నాయి రజని బీసీ కావడంతో మెజార్టీ బీసీ వర్గాలు ఇటు మహిళలు డ్వాక్రా సంఘాల మహిళలు ఆశా వర్కర్లు వీళ్లంతా కూడా రజని వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు ఎన్ని ఎత్తులు వేసినా.. ఎన్ని ఈక్వేష‌న్లు ఉన్నా కూడా వెస్ట్‌లో ర‌జ‌నీ ఫుల్ స్వింగ్‌లో వెళుతోన్న వాతావ‌ర‌ణం క్లీయ‌ర్‌గా క‌నిపిస్తోంది.