ఆ ఒక్క తప్పే నిత్యామీనన్ ని.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం చేసిందా..?

మనం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు మన లైఫ్ నీ బొక్క బోర్లా పడేలా చేస్తుంది. అది ఏ రంగమైన సరే ..అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు . అయితే కొన్నిసార్లు తెలిసి తెలియక అలాంటి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు . కాగా ఇండస్ట్రీలో అలాంటి ఒక తప్పు చేసి స్టార్ హీరోయిన్గా ఉండాల్సిన బ్యూటీ ఇప్పుడు ఫెడవుట్ హీరోయిన్గా మారిపోయింది .

ఆమె మరి ఎవరో కాదు .. నిత్యామీనన్ . పేరుకి మలయాళ బ్యూటీనే .. అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి మెప్పించింది. మంచి మంచి సినిమాలు ఆమె ఖాతాలో ఉండడం గమనార్హం . కెరియర్ పిక్స్ లో ఉండగానే బాలీవుడ్ లో బోల్డ్ వెబ్ సిరీస్ లో నటించి షాక్ ఇచ్చింది.

అంతేకాదు అంతకుముందే తెలుగు ఇండస్ట్రీలో బిగ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది . మహానటి అనే సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ కన్నా ముందు నిత్యమీనన్ ని అనుకున్నారట . కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేయడం అప్పట్లో అందరికీ షాకింగ్ గా అనిపించింది . ఇలా ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇండస్ట్రీ నుంచి ఆమెను ఫెడ్ అవుట్ అయ్యేలా చేశాయి అంటున్నారు అభిమానులు..!