దానికోసమే నేను బార్ లో గంటలు గంటలు గడిపే దాన్ని.. షాకింగ్ కామెంట్స్ చేసిన అదా శర్మ..!

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అదా శర్మ ‘ హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడుకి అనుకున్నంత క్రేజ్ అయితే రాలేదు. కానీ, ఇటీవల వచ్చిన డి కేరళ స్టోరీ’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనితో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా..అదే తరహాలో వచ్చిన ‘ బస్తర్ ది నక్సల్ స్టోరి’ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంది.

ఇక తాజాగా ‘సన్ ఫ్లవర్ ‘ వెబ్ సిరీస్ తో అలరించి. ఇందులో ఓ బార్ డ్యన్సర్ క్యారెక్ట క్ లో సందడి చేసిన ఈ అమ్మడు. ఈ క్యారెక్టర్ నేచురల్ గా వచ్చేటందుకు తాను పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదా శర్మ మాట్లాడుతూ..’ బార్ డ్యాన్సర్ క్యారెక్టర్ నాచురల్ గా వచ్చేందుకు.. బార్ కి విళ్లి మరి అక్కడ క్షుణ్ణంగా పరిశిలించేదాన్ని. నటనలో సహజత్వం కోసం అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు బార్ లో గంటలు గంటలు గడిపేదాన్ని.

కస్టమర్లతో మాట్లాడటం మిగిలిన అన్ని విషయాలు ప్రత్యేకంగా తెలుసుకున్నాకే నాలో కాన్షిడెన్స్ వచ్చింది. సిరీస్ చూస్తే ప్రేక్షకుల కళ్ళకు వాస్తవంగా అనిపించాలని, ఎంత పర్ ఫామెన్స్ ఇచ్చిన నటనలో సహజత్వం కనిపించకపోతే ప్రేక్షకులను ఆకట్టుకోలేము. అందుకే నేచురాలిటి కోసం రోజు రాత్రి 9 గంటలకు వెళ్లి ఉదయం 4,5 గంటల వరకు బార్ లోనే గడిపే దాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆదాశర్మ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.