అలాంటి పని చేయడం కూడా వ్యాయామమే.. నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు భార్య నమ్రత గురించి తెలిసిందే. మహేష్ బాబు ‘వంశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె..’అంజి’ ,’టక్కరి దొంగ’ మూవీస్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బాయ్ మహేష్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత..

ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయింది.ఫ్యామిలీ లైఫ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ..కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటుంది. అయితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నమ్రత..తనకు,ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటుంది.

అంతేకాకుండా..సినిమాల్లో నటించినప్పటికీ ఫిట్ నెస్ మాత్రం అలాగే మెయింటేన్ చేస్తుంది. ఈ మేరకు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తుంది నమ్రత. ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్టింట షేర్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా.. జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. సాడ్ గా కూర్చున్న ఫోటో షేర్ చేస్తూ..’ సీట్స్ మధ్య పగటి కలలు.. వ్యాయామం ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.