అలా ఉంటేనే మానభంగాలు జరుగుతాయి.. బోల్డ్ బ్యూటీ అనసూయ సంచలన పోస్ట్..!

బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ. ప్రస్తుతం వెండి తెరపై కూడా దూసుకుపోతుంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాలో ‘ రంగం అత్త క్యారెక్టర్ తో ఫుల్ క్రేజ్‌ తెచ్చుకున్న అనసూయ..రీసెంట్గా వచ్చిన ‘రజాకర్’ సినిమాతో కూడా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రాజెంట్ అల్లు అర్జున్ ‘ పుష్ప-2’ సినిమాతో బిజీగా ఉన్న ఈ యాంకర్..సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉంటుంది.

పొట్టి బట్టలు ధరిస్తూ..ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆమె డాన్సింగ్ పై నెట్టింట ట్రోల్స్ జరిగినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా..ట్రోల్స్ కు దీటుగా ఆన్సర్లు ఇస్తూ గ్లామర్ ప్రదర్శన చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే..తాజాగా అనసూర్య ఫ్యాన్ పెట్టిన ఓ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది. అయితే..మమిళలు ధరించే దుస్తులు వలన మానభంగాలు జరుగుతున్నాయి అనే వాదనులకు..అనసూయ అభిమాని ‘మన ఆలోచనలు బట్టి ఉంటుంది. స్త్రీలు ధరించే దుస్తులు బట్టి కాదు’అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై స్పందించిన అనసూయ ‘నన్ను అభిమానించే వాళ్లు కొందరి ఫ్యాన్ క్రేజీల మాదిరిగా..

ఎప్పుడూ ఎవరిని దర్భాషలాడలేదు, ఎవరిని లక్ష్యంగా చేసుకోలేదు,ఎవరిని ఎప్పుడు రెచ్చగొట్టలేదు లేదా అనవసరంగా ఎవరిని ఆ గౌరవించలేదు. తప్పుడు విషయాలపై దృష్టి పెట్టలేదు, ఎలాంటి బాధ్యత తీసుకోకుండా పారిపోలేదు..కేవలం స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు.ఇది నేను గౌరవిస్తున్నాను. కానీ చాలామంది ‘గుమ్మడికాయ దొంగలు’ మళ్లీ జంతువుల్లా రెచ్చిపోతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు నాకు తెలుసు. అయినా నేను స్ట్రాంగ్ గా ఉంటాను. ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లంతా మంచి మనుషులు. వారికి నేను అండగా ఉంటాను. ఎల్లప్పుడూ ప్రేమ ‘అంటూ పోస్ట్ పెట్టింది.