ఢిల్లీలో లోకేష్..నో యూజ్?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు పవన్ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. టి‌డిపి-జనసేన కలిసి పనిచేయనున్నాయని ప్రకటించారు. ఇక పొత్తు ప్రకటనతో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. టి‌డి‌పితో పాటు జనసేన టార్గెట్ గా విరుచుకుపడుతుంది. ఇక వైసీపీకి కౌంటరుగా టి‌డి‌పి, జనసేన కూడా రాజకీయం చేస్తున్నాయి.

ఇదే సమయంలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో సీన్ మరింత మారింది. అయితే ఢిల్లీకి వెళ్ళి లోకేష్..అక్కడ పెద్దల మద్ధతు పొందాలని ప్రయత్నించినట్లు అర్ధమవుతుంది. కానీ ఎక్కడ కూడా లోకేష్‌కు మద్ధతు దక్కడంలేదు. టి‌డి‌పికి ఉన్నది ముగ్గురు లోక్ సభ, ఒక రాజ్యసభ ఎంపీ. వారితో పోరాటం కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో టి‌డి‌పి ఎంపీలు బాబు అరెస్ట్‌ని ప్రస్తావిస్తూ పోరాటం చేస్తున్నారు. కానీ దానికి వైసీపీ ఎంపీలు సైతం స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన చేస్తున్నారు. అయితే టి‌డి‌పి ఎంపీ, మాజీ ఎంపీలు తప్ప. ఏ ఇతర పార్టీ ఎంపీల మద్ధతు లోకేష్‌కు లేదు. టి‌డి‌పి అనుకూల మీడియాలో ఢిల్లీలో లోకేష్ ఏదో చేసేస్తున్నట్లు హడావిడి చేస్తుంది. కానీ అక్కడ ఏమి లేదు. లోకేష్ హడావిడి తప్ప..అక్కడ మద్దతు ఏమి రావట్లేదు.

దీంతో లోకేష్ ఢిల్లీ పర్యటనతో ఒరిగిందేమీ  కనిపించడం లేదు. పైగా ఢిల్లీ నుంచి రాగానే లోకేష్‌ని సి‌ఐ‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారం వస్తుంది. అదే జరిగితే టి‌డి‌పి మరింత మునగడం ఖాయం.