మీ మేకప్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మేకప్ కిట్ మార్చాల్సిందే..!!

మీరు మీ మేకప్ కిట్ ని ఎక్కువ కాలం నుంచి వాడుతున్నారా? అయితే మీ చర్మానికి సమస్యలు మొదలైనట్టే. మీ మేకప్ కిట్ ని మార్చవలసిన సమయం వచ్చిందని మీకు అర్థమయ్యే కొన్ని సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మేకప్ కిట్ ని మనం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే వాడతాం. వాటికి లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. మస్కార లాంటి వాటికి లైఫ్ ఇంకా తక్కువగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా చూసి.. టైం అయిపోయిన తర్వాత పారేసి కొత్తది కొనుక్కోవడం మంచిది.

లేకపోతే లేనిపోని సమస్యలు చర్మానికి వచ్చి చుట్టుకుంటాయి. మనం మేకప్ వేసుకున్నప్పుడు దాని వాసనని తరచుగా చూస్తూ ఉండాలి. దాని వాసన ఏమైనా మారుతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని లైఫ్‌స్పెన్ అయి పాడైపోతుందని అర్థం. అలాంటి సమయంలో దానిని మార్చేయడం మంచిది. మనం ఒక మేకప్ ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని ఎక్స్పైరీ డేట్ తెలియకపోతే కొన్ని నెలలు వాడిన తర్వాత దాన్ని మార్చేయడం మంచిది. ఎందుకంటే ఒక మేకప్ కిట్ ని సంవత్సరం కన్నా ఎక్కువ వాడిన తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుందో.. లేదో మనకి తెలియకపోతే దానిని వాడడం డేంజర్ లో పడడం కన్నా మార్చేయడం బెటర్.

మనం మేకప్ కిట్ వాడుతున్నప్పుడు అది రోజు రోజుకి ఒరిజినల్ షేప్, కలర్ తగ్గుతూ ఉంటుంది. కొన్ని రోజులకి అది ఎప్పుడైతే దాని సొంత రంగు రూపాన్ని విడుస్తుందో… అప్పుడు అది హార్మ్ ఫుల్ గా మారుతున్నట్లు దానిని అర్థం చేసుకుని దానిని మార్చడం మంచిది. మార్చకుండా ఆ మేకప్ కిట్ తో మేకప్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి.