బ్రేకింగ్: హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించారు హీరో విజయ్ ఆంటోనీ..బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. దీంతో కోలీవుడ్ చిత్రాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు. ఈయన కూతురు పేరు లారా ఈమెకు 16 సంవత్సరాలు..ఈ రోజున ఈమె చెన్నైలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియవు కానీ ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హీరో సన్నిహితులు సైతం తెలియజేస్తున్నారు.

లారా చెన్నైలోని చర్చి పార్కు స్కూలులో 12వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లారా వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఉదయం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతున్న ఆమెను గుర్తించిన విజయ్ ఆంటోని దంపతులు వెంటనే దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా అప్పటికి ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు గుర్తించారు. లారా ఒత్తిడి కారణంగానే ఆమె మరణించి ఉండవచ్చని విజయ్ సన్నిహితుల సైతం తెలియజేస్తున్నారు.

అయితే ఈమె మృతికి గల కారణాలు ఇంకా తెలియదు కానీ ఈ విషయంతో విజయ్ ఆంటోనీ కుటుంబం చాలా తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన విజయ్ ఆంటోని బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి 14 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ అందుకుంది. ఈ సినిమాకి కొనసాగింపుగా ఏడాది బిచ్చగాడు-2 చిత్రంతో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోని కూతురు మరణం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.