రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా నలుగురు టాప్ డైరెక్టర్లని రిజెక్ట్ చేశాడా.. వాళ్ళు ఎవరంటే.. ?!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ నటవార‌సుడిగా ఎంట్రీ ఇచ్చీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని.. లక్షలాదిమంది అభిమాన హీరోగా మారిపోయాడు. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ తో దూసుకుపోతున్న మహేష్.. ఇప్పటికి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాల్లో నటించనున్నాడు. ఈ సినిమాలో తనని తాను కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకున్నే ప్రయత్నంలో ఉన్నాడు మహేష్.

Prashanth Neel making a roundtrip to top stars

ఈ క్రమంలో ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్ దాదాపు నాలుగు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందంటూ న్యూస్ వైరల్ గా మారింది. మహేష్ తనను తాను స్టార్ హీరోగా మరోసారి డిఫరెంట్ గా ఎలివేట్ చేసుకోవాలంటే అది రాజమౌళి మూవీతోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే రాజమౌళితో సినిమా చేయడానికి భారీగా ఏర్పాట్లు చేసుకున్నాడట మహేష్. ఇక ఈ సినిమా కోసం మహేష్.. ప్రశాంత్ నీల్‌, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, అనీల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలను వదులుకున్నారని తెలుస్తుంది.

తెలుగు రాష్ట్రాల‌కి రూ.10 ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించిన కొరటాల, అనిల్  రావిపూడి | koratala Shiva and anil ravipudi donate 10 lakhs to telugu states

ఈ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాలు కేటాయించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతమంది స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేసిన రాని గుర్తింపు రాజమౌళి కాంబోలో నటించే ఆ ఒక్క సినిమా తోనే వస్తుందని మహేష్ బాబు నమ్మకంతో ఉన్నారట. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో వేచి చూడాలి. అయితే మహేష్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని.. హాలీవుడ్ లెవెల్ లోను స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడు అంటూ మహేష్ అభిమానులు ధీమాతో ఉన్నారు.