ఫామ్ హౌస్‌లో యువకుడి మృతి.. కేసీఆర్ షాక్!

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు ఎర్రవల్లిలో ఓ ఫామ్ హౌజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫామ్ హౌజ్ నుండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని పలుమార్లు విపక్ష నేతలు విమర్శలు చేస్తూ ఎద్దేవా చేయడం మనం చాలాసార్లు చూశాం. ఇక ఈ ఫామ్ హౌజ్ కారణంగా ఎర్రవల్లి చుట్టుపక్కాల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతుండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌజ్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన తన వ్యవసాయ […]

కేటీఆర్‌ సార్‌.. మేయర్‌ గారెక్కడ?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్లు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. కార్పొరేటర్లందరికీ కాదు కదా సొంతపార్టీ కార్పొరేటర్లకు కూడా మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అందుబాటులో ఉండటం లేదు. తమ డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మేయర్‌ ను కలిసి వివరిద్దామనుకుంటే వారికి నిరాశే ఎదురవుతోంది. మాకే మేయర్‌ అందుబాటులో లేకపోతే మేం ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించగలం? అని వాపోతున్నారని సమాచారం. 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి పేరు బయటకు రావడం.. ఆమెను […]

రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]

ఫస్ట్ ఎటు పోదాం సామీ?

ఆయనంటే రాజకీయ నాయకులకు ఓ నమ్మకం.. ఓ భరసా.. తమ పార్టీని అధికారంలోకి తెస్తాడనే ఆశ.. అలా చేశాడు కూడా.. కావాల్సినంత డబ్బులిస్తే తన మేధస్సు ఉపయోగించి ఎలాగైనా పవర్ తెప్పిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు.. అలా జరుగుతోంది కూడా. ఆయనే పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్. అలాంటి వ్యక్తే ఇపుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడట. ఏ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల విషయంలో. ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తానని మాటిచ్చాడు. […]

కారులో ఇమడలేకపోతున్న డీఎస్!

ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్).. ఉమ్మడి ఏపీలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వ్యక్తి.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. హస్తం పార్టీకి తెలంగాణలో పెద్దగా ఆదరణ లేకపోవడంతో డీఎస్ కారు పార్టీ ఎక్కాడు. ఆయనకున్న ఇమేజిని ద్రుష్టిలో పెట్టుకున్న కేసీఆర్ రాజ్యసభకు పంపాడు. అయితే ఎందుకో రెండు, మూడేళ్లుగా ఆయన గులాబీ పార్టీలో అయిష్టంగానే ఉన్నాడు. ఉమ్మడి ఏపీలో ఆయన హవానే వేరు.. వైఎస్, డీఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీని శాసించారని కూడా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. […]

ఆ రెండు యూనియన్లే కీలకం అంతే..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల యూనియన్లు అనేకమున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే సమయోం మాత్రం కేవలం రెండే రెండు యూనియన్ల పేర్లు బయటకు వస్తాయి. సర్కారు కూడా వారితోనే చర్చలు జరుపుతుంది. మరే సంఘంతోనూ చర్చలు జరిపినట్లు కనిపించడం లేదు. ఆ రెండు సంఘాలు ఏవంటే.. ఒకటి టీజీఓ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), మరొకటి టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్). ఉద్యగులకు […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]

కారు పార్టీలో ‘స్మార్ట్‘ భయం!

ల్యాండ్ ఫోన్.. బేసిక్ ఫోన్ ఉన్నపుడే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్లు..ఒక్కరి విషయాలు ఒకరికి మాట్లాడితే తప్ప తెలిసేది కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేదు.. ప్రైవసీ అసలే లేదు.. స్మార్ట్ ఫోన్ మన మనసుల్లోకి తొంగి చూస్తోంది.. ఎప్పుడేం మాట్లాడినా కనిపెట్టేస్తోంది..కనిపెట్టడమే కాదు ఇతరుల చెవుల్లోకి దూరిపోతోంది.. అందుకే స్మార్ట్ ఫోన్ లో మాట్లాడాలంటేనే భయం.. పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడే పరిస్తితి లేదు.. ఎందుకంటే రికార్డింగ్ సౌకర్యం అందులో ఉండటంతో […]

ఎన్నికల తరవాత పదవుల జాతర

కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇంకాఉన్నది కేవలం 18 నెలలే.. దీంతో పదవులు దక్కని నాయకులు పార్టీలో కేసీఆర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులొద్దు.. నామినేటెడ్ పోస్టులివ్వాలని కోరుతున్నారు. దీంతో బాసు.. నామినేటడ్ పోస్టుల భర్తీపై ద్రుష్టి సారించారట. ఈనెలల జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఈ కసరత్తు మొదలైనట్లు తెలిసింది. టీఎస్ఆర్టీసీతోపాటు బీసీ […]