డిపాజిట్లే రాలేదు.. అధికారం సాధ్యమా?

తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే మాట పదే పదే మీడియాతోపాటు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లి హైకమాండ్‌తో కూడా ఇవే ముచ్చట్లు చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు, జీహెచ్‌ఎంసీలో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను కాదని మనపార్టీ సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడితే అధికార పీఠంపై కూర్చోవచ్చు అనేది స్థానిక బండి […]

కేసిఆర్ ..ఈ ప్రశ్నకు బదులేదీ?

వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. పది రోజుల క్రితం హైదరాబాద్‌, ఢిల్లీలో ఇదే చర్చ. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు వరిని కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్‌ ఇందిరాపార్కులో నిరసనకు దిగారు. తరువాత ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీలో ఎవరినీ కలువకుండా తిరిగొచ్చారు. మరి ఎందుకు.. ఏమిటి అనేది ఆయనా చెప్పలేదు. ఎవరూ అడగలేదు. ఈ సమస్యపై పార్లమెంటులో కారు పార్టీ సభ్యులు రచ్చచేస్తున్నారు. కేకే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలే […]

వద్దన్నా పంపిస్తున్నారు..టీఆర్ఎస్ టూర్ పాలిటిక్స్

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధిష్టానం ఇతర రాజకీయ పార్టీలకంటే ఓ స్టెప్ ముందే ఉంటుంది.. ఏసమస్య రాకపోయినా.. లేకపోయినా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో పార్టీ చీఫ్ కేసీఆర్ అందెవేసిన చేయి. అందుకే తెలంగాణలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తుంటారు. ఇతర పార్టీల నాయకులు కూడా తమ సన్నిహితులతో ఇదే చెబుతుంటారు. రాష్ట్రంలోని ఉమ్మడి ఐదు జిల్లాల్లో ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. […]

సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం […]

కేసీఆర్ వైపు చూపిస్తున్న కిషన్ వేలు

నేను ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించా.. అయినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. నేను కేంద్ర మంత్రి కావడం ఆయనకు ఇష్టం లేదేమో.. అందుకే కలవడానికి అవకాశం ఇవ్వలేదేమో.. అని కేంద్ర కేబినెట్ మంత్రి, టీ.బీజేపీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో రైతులకేమో గానీ పార్టీల మధ్య వేడిపుట్టింది. ఓ వైపు రైతులు ప్రాణాలు కోల్పోతుంటే.. కారు, కమలం పార్టీలు మాత్రం రాజకీయ గొడవలకు దిగుతున్నారు. […]

రామోజీ.. భజన అలా కొనసాగుతోంది…

తెలుగు మీడియాలో బాహుబలిగా చెప్పుకునే రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సీఎం కేసీఆర్‌ కుటుంబానికి భజన మీద భజన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో కేటీఆర్‌, ఇప్పుడు కవితను పొగడ్తలతో ముంచెత్తుతూ మీడియా సర్కిల్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో శుభాకాంక్షలు తెలుపుతూ బహిరంగ లేఖ రాసి తన కేసీఆర్‌ ఫ్యామిలీ […]

అరె సార్.. జర మాట్లాడరాదె..

వరి కొనుగోలు సమస్య వచ్చిన వెంటనే అలర్ట్ అయిన సీఎం కేసీఆర్.. గంటలకొద్దీ వరుస ప్రెస్ మీట్లు.. ఇక్కడ బండి సంజయ్ మొదలు ఢిల్లీలో మోదీ మీద వరకు విమర్శలు.. కేంద్రం ఏం చేస్తలేదు.. బండి సంజయ్ నాటకాలాడుతున్నాడు.. అంటూ డైలాగుల మీద డైలాగులు.. మీరు కొంటరా..కొనరా చెప్పాలని డిమాండ్.. ఇక ఇందిరా పార్కులో ధర్నా.. కేంద్రం చెప్పి తీరాలె.. లేకపోతే ఢిల్లీ బోతం.. మెడలు వంచుతాం అంటూ ఆవేశపూరిత ప్రసంగం.. చెప్పినట్టుగానే ఢిల్లీ వెళ్లడం.. అక్కడ […]

కెసిఆర్,బండి అయిపోయారు …ఇక రేవంత్ వంతు..

వరి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కరించాలని టీఆర్ఎస్, బీజేపీలు తమ ప్రయత్నాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము సైతం రైతు వెంటే.. అంటూ ముందకు వచ్చింది. మంచిదే.. రైతుల సమస్య పరిష్కారానికి ఎవరు పోరాడినా అందరూ మద్దతు పలకాల్సిందే. కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తే బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇపుడు రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్టీ వరి దీక్షను ఈరోజు (శనివారం) […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]