ఓరి దేవుడోయ్..ఈ శ్రీలీల కి ఎంత ధైర్యం..అందరి ముందే స్టేజీ పై అలా చేసేసింది ఏంట్రా బాబు(వీడియో)..!!

వామ్మో.. ఈ కన్నడ పిల్ల శ్రీలీలకి ధైర్యం ఎక్కువే.. ఏ హీరోయిన్ చేయని పనిని సునాయాసంగా స్టేజిపై చేసేసి వారెవ్వా అనిపించింది. మనకు తెలిసిందే శ్రీ లీలా మంచి డాన్సర్ ..ఎలాంటి స్టెప్స్ అయినా సరే అవలీలగా వేసేస్తుంది . మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ పెట్టి సాంగ్ ని స్టేజిపై పెర్ఫార్మెన్స్ చేసింది . సాధారణంగా హీరోయిన్ ఎవరైనా సరే ఇలా డాన్స్ చేయమంటే ఇలా అభిమానుల మధ్యలోకి రావడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు.

అయితే శ్రీ లీల మాత్రం ఏ మాత్రం సిగ్గు మొహమాటం బిడియం లేకుండా స్టేజిపై ఊర నాటు మాస్ స్టెప్స్ తో ఇరగదీసేసింది . రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని కాలేజీ ఫెస్ట్ లో సందడి చేసింది . నెల్లూరులోని ఓ కాలేజ్ ఫెస్ట్ కి గెస్ట్ గా వెళ్లిన ఆమె అక్కడ స్టూడెంట్స్ తో కలిసి స్టేజిపై ఆ కుర్చీని మడత పెట్టి అంటూ నాలుక మడత పెట్టి నడుమును గిరగిరా తిప్పేసింది . ఆమె వేసిన స్టెప్స్ చూస్తే కళ్ళు జిగేల్ అన్నాల్సిందే.

ఏ హీరోయిన్ కూడా ఇంత సాహసం చేసి ధైర్యంగా ఫ్యాన్స్ తో స్టెప్స్ వేయరు . ఆమె డాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ మధ్యకాలంలో శ్రీలీలకు ఆఫర్స్ ఏమీ రాకపోతు ఉండడం గమనార్హం. ఆమె కొత్తగా సినిమాలకు కమిట్ అవ్వడం లేదు . ఎందుకంటే ఆమెకు సినిమా ఆఫర్లు రావడం లేదు. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతూ ఉండడంతో శ్రీ లీల క్రేజ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోయింది. కానీ కుర్రాళ్ళు మాత్రం ఆమె అంటే పడి చచ్చిపోతున్నారు . ఆమెతో డాన్స్ చేయాలి అని తెగ ఆరాట పడిపోతున్నారు . చూద్దాం ఇలా స్టెప్స్ వేస్తేనైనా శ్రీలీలకు ఆఫర్లు వస్తాయి ఏమో..??

 

 

View this post on Instagram

 

A post shared by Rajesh Manne Official (@rajeshmanne1)