రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు.. వాడిని హగ్ చేసుకుని పడుకోవాలి.. బిగ్ బాస్ అశ్విని శ్రీ బోల్డ్ కామెంట్స్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది అశ్విని శ్రీ. అయితే ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతున్నా.. నటిగా ఊహించిన గుర్తింపు రాలేదు. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో మెప్పించిన ఈ అమ్మడు.. బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. 5వ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ.. హౌస్ లో మిగతావాళ్లు తనని కలుపుకోవడం లేదంటూ ఆందోళన చెందింది. బోలే షావలి, ప్రిన్సి ఎవరితో ఆమె ఎక్కువగా సన్నిహితంగా ఉండేది. 12వ వారం అశ్విని ఎలిమినేట్ కాగా.. హౌస్ లో అశ్వినీ గ్లామర్ ఓ రేంజ్‌లో ఎక్స్పోజ్ చేసింది. ఇక ఆమె ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడుతూ ముక్కు సూటిగా సమాధానం చెబుతూ ఉంటుంది.

Bigg Bossలో ఎక్స్ పోజింగ్ కోసమే అశ్విని శ్రీ ఎంట్రీ.. ఇంతకీ ఆమె చరిత్ర  ఏంటంటే?-bigg boss 7 telugu ashwini sri background and interesting facts  ,ఫోటో న్యూస్

ఈ క్రమంలో ఇంటర్వ్యూలో అస్వినీ శ్రీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బాయ్ ఫ్రెండ్ గురించి అశ్విని శ్రీ కి ప్రశ్న ఎదురు కాగా.. తన మైండ్ లో ఉన్న బోల్డ్ ఆలోచనలను బయటపెట్టింది అశ్విని. మీకు ఎలాంటి భర్త కావాలి అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. అందం, డబ్బు లేకపోయినా పర్వాలేదు. మంచివాడై ఉండాలి. నాకు కాబోయే వాడు ఇండస్ట్రీకి చెందిన వాడు కాకూడదు. ఇండస్ట్రీలో వ్యక్తులు ఎప్పుడు బిజీగా గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నన్నేం చేసుకుంటారు. అందుకే నేను ఇండస్ట్రీ వాళ్ళను పెళ్లి చేసుకోను. కానీ నేను ఇండస్ట్రీలో కొనసాగుతా అంటూ వివరించింది. నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ ఇంకా ఎదురు కాలేదని.. దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ చెప్పుకొచ్చింది.

Ashwini Sri (@actress_ashwini) / X

వాడి కోసమే ఎదురు చూస్తున్నానని.. ఎక్కడున్నావ్ త్వరగా రా రా బాబు అంటూ కామెంట్స్ చేసింది. నేను రెడీగా ఉన్నాను. వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు. నాకు లాగే తాను క్రేజీగా ఉండాలి. బెడ్ పై వాడు తోడుగా ఉంటే కానీ నిద్ర పట్టదేమో అనేంతల నా డ్రీమ్ బాయ్ నన్ను చూసుకోవాలి. నిజంగా నాకు రాత్రి నాలుగు అవుతున్న నిద్ర పట్టడం లేదు. వాడుంటే హాగ్‌ చేసుకొని పడుకుంటా అంటూ మనసులో ఉన్నదంతా బోల్డ్ గా బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ‌. దీంతో ప్రస్తుతం అశ్విని శ్రీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ లక్కీ ఫెలో ఎక్కడ ఉన్నాడో అంటూ.. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని నాలో ఉన్నాయి నిన్ను చేసుకోవడానికి నేను రెడీ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.