ఆ పని చేయడానికి రెడీ అయిన రామ్ చరణ్.. ఈ మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరో ఫ్యాన్స్ మరి ఓవర్ చేస్తున్నారు . ఎంతలా అంటే తమ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ తమకి ఇష్టమైన హీరోతోనే నటించాలి ..? లేదా .. హీరోయిన్ తోనే నటించాలి..? అంటూ కండిషన్స్ పెడుతున్నారు . అంతేకాదు ఫలానా కంటెంట్ ఉన్న సినిమాలోనే నటించాలి .. ఫలానా డైరెక్టర్లతోనే సినిమాకు ఓకే చేయాలి .. ఫలానా తేదీన సినిమాలు రిలీజ్ చెయ్యాలి అంటూ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు .

కొంతమంది హీరోస్ ఫ్యాన్స్ విషయంలో అసహనంగా ఉండడం గమనార్హం. కాగా తాజాగా రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అంతేకాదు సుకుమార్ దర్శకత్వంలో ఒక క్రేజీ సినిమాకు కూదా కమిట్ అయ్యాడు.

అయితే ఇలాంటి మూమెంట్లోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో ..సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడట చరణ్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఆ హీరో అంటే చరణ్ కి ప్రాణం అని మొదటి నుంచి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. ఆ కారణంగానే ఆయన అడగ్గానే ఆ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ చేయడానికి ఓకే చేశారట. అయితే దీనిపట్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు .

గ్లోబల్ స్ధాయి లో ఇమేజ్ సంపాదించుకున్న నువ్వు.. ఒక హీరో సినిమాలో గెస్ట్ రోలా..? వద్దనే వద్దు చేయనే చేయకు అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు . అంతేకాదు చరణ్ ఇప్పుడిప్పుడే నువ్వు గ్లోబల్ స్థాయిలో స్టార్ గా మారుతున్నావని ..చిన్నాచితకా హీరోల సినిమాలలో నటిస్తే నీ క్రేజ్ మళ్ళీ ఢమాల్ అంటూ పడిపోతుంది అని సజెస్ట్ చేస్తున్నారు . ఒకవేళ ఫ్యాన్స్ మాటలు కాదని ఆ హీరో సినిమాలో నటిస్తే ఈ మెగా ఫాన్స్ ఊరుకుంటారా అంటూ పక్క హీరో ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం..!!