సమ్మర్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. అసలు మిస్ కావద్దు..!!

సమ్మర్ పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అన్న సంగతి తెలిసిందే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనలోకి పిల్ల‌లు వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులతో ఆటలు, హుషారుగా సమయం గడపవచ్చని భావిస్తూ ఉంటారు. ఆటల్లో పడి సమయానికి ఆహారాన్ని తినడం, పానీయాలు త్రాగడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఫలితంగా వడదెబ్బకు గురై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే సమ్మర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అవేంటో ఒకసారి చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా పిల్లల్లో కనిపించే సమస్య డిహైడ్రేషన్.

ఆటల్లో పడి శరీరానికి సరిపడా నీటిని కూడా తాగకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు డిహైడ్రేట్ అవుతూ ఉంటారు. కనుక తల్లిదండ్రులు ప్రతిగంటకు పిల్లలను వాటర్ తగేల ప్రేరేపించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో వాటర్ బాటిల్ ని ఇచ్చి పంపాలి. అలాగే వేసవిలో పిల్లల చేత తగిన మోతాదులో కొబ్బరి నీరు తాగిస్తూ ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఫ్రూట్ జ్యూస్, రాగిజావ, లెమెన్ వాటర్, మజ్జిగ ఇలాంటి చ‌ల‌వ‌ చేసే పానీయాలను పిల్లలకు ఇవ్వడంతో డిహైడ్రేషన్‌కు చెక్‌ పెట్టవచ్చు. హిట్ స్ట్రోక్ నుంచి కూడా మనం పిల్లలు కాపాడవచ్చు. అలాగే ఈ డ్రింక్ శరీరానికి బోల్డంత శక్తిని ఇస్తాయి. ఇక సమయం దొరికింది అంటే పిల్లలు కూల్డ్రింక్స్, ఐస్క్రీం, జంక్ ఫుడ్ అంటూ బయట ఆహారాన్ని తినేందుకు ఆసక్తి చూపుతో ఉంటారు.

ఇవి ఆరోగ్యానికి అసలు మంచిది కాదన్న సంగతి తెలిసిందే. ఈ ఆహారాలన్నీ ఎసిడిటీ, మలిబద్ధకం, కడుపునొప్పి, గొంతు నొప్పి, జలుబు లాంటి సమస్యలకు దారి తీస్తాయి. కనుక కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ ల జోలికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఫ్రిడ్జ్ వాటర్ తెగ తాగేస్తుంటారు. ఫ్రిజ్ వాటర్ కన్నా మట్టికుండలో నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. ఇక వేసవిలో పిల్లలకు ఎక్కువగా లేత రంగు దుస్తులు వేయడం మంచిది. తప్పకుండా సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల చర్మ సమస్యలు తలెత్తకుండా కాపాడవచ్చు. ఇక లేత రంగు దుస్తులు వేయడం వల్ల వేడిని తక్కువగా గ్రహిస్తాయి. ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించాలి.