మండే ఎండల్లో కొబ్బరి నీరు.. నిమ్మరసంలో ఏది బెస్ట్‌ ఎనర్జీ డ్రింక్ గా పని చేస్తుందో తెలుసా..?!

వేసవిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎదురుకొనే సమస్య డిహైడ్రేషన్. ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక హైడ్రైటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే అంద‌రికి ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మరసం.. కొబ్బరినీరు.. ఈ రెండు పానీయాలను డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదన్న అవగాహన చాలామందిలో ఉండదు. వేసవికాలంలో శరీరానికి తగిన మోతాదులో పానీయాన్ని అందించి హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ఎంతైనా అవసరం. దీనికోసం మనం ఎప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ ఉండాలి.

ఈ క్రమంలో కొంతమంది కొబ్బరినీళ్లు తరచుగా తాగుతూ ఉంటే.. మరి కొంతమంది నిమ్మ రసాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కనుక ఈ రెండిట్లో ఏది మంచిదో ఒకసారి చూద్దాం. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా లభిస్తాయి. హైడ్రేషన్ కోసం ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. కొబ్బరినీటిలో ఉండే పొటాషియం, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కండరాలను బలోపేతం చేయడానికి సహకరిస్తాయి. అలాగే కొబ్బరి నీళ్లల్లో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తాయి. ఇక నిమ్మ‌ రసం తక్కువ క్యాలరీలో పానీయం. ఇందులో విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్‌ సమృద్ధిగా లభిస్తాయి.

మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి.. సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడడానికి.. జీర్ణ క్రియను మెరుగుపరచడానికి.. నిమ్మరసం సహకరిస్తుంది. అయితే నిమ్మకాయలో ఉండే యాసిడ్లు ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో ఇది శరీరంలో పీహెచ్ స్థాయి నిర్వహించడానికి సహకరిస్తుంది. వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కనుక జ‌మ‌ర్‌ లో డిహైడ్రేషన్ మెరుగుపరచుకోవడానికి నిమ్మరసం, కొబ్బరి నీరు రెండిటిని మీరు తీసుకోవచ్చు. ఈ రెండు డిహైడ్రేషన్ సమస్యకు చక్కగా పనిచేస్తాయి. ఓవైపు కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ లో పని భర్తీ చేయవచ్చు. అలాగే నిమ్మ రసాన్ని తాగడం వల్ల శరీరాన్ని డిటాక్స్ చేసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.