అశ్లీలంగా చూపిస్తాడు.. రాఘవేంద్రరావుతో నేను సినిమా చేయనంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిని.. ఎవరో తెలుసా..?!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరైన కే.రాఘవేంద్రరావుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు అన్ని రకాల జాన‌ర్‌ల‌లో సినిమాలు తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు రాఘవేంద్రరావు. దాదాపు మూడు తరాల హీరో, హీరోయిన్‌ల‌తో పనిచేసిన ఈయన కమర్షియల్ సినిమాల్తో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్నాడు. రాఘవేందర్రావు ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక‌ సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సాంగ్స్ ర‌సికుల‌కు జూప‌ర్ ట్రీట్‌లా ఉంటాయి. మూవీకే ఆ సాంగ్స్ హైలెట్‌గా నిలిచిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

K. Raghavendra Rao - IMDb

హీరోయిన్ నాభి పై రంగురంగుల పళ్ళు, నీటితో జ‌ల‌క‌లాట‌లు చేయిస్తూ, పక్షులతో గిలిగింతలు పెట్టిస్తూ హీరోయిన్ అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. హీరోయిన్ల గ్లామర్ ను ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డంలో ఆయ‌న‌దు ఓ ప్ర‌త్యేక శైలి. ఈ క్ర‌మంలో రాఘవేందర్రావును ఎంతోమంది విమర్శలు కురిపించిన సంధ‌ర్భాలు ఉన్నాయ‌. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న స్టార్ బ్యూటీ తాప్సి ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి రాఘవేందర్రావు డైరెక్షన్ వహించారు. ఈ మూవీలో ఓ సీన్ కోసం తన‌ బొడ్డు మీద కొబ్బరి చిప్పలు విసిరారని.. ఆ సాంగ్లో గుమ్మడికాయలు కూడా వాడారు. దేవుడి దయ వల్ల అవి నాపై వేయలేదు అని ఫన్నీ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

Smita Patil | Most beautiful indian actress, Indian bollywood actors,  Beautiful bollywood actress

కాగా 40 ఏళ్ల క్రితం రాఘవేంద్రరావు పట్ల ఓ స్టార్ హీరోయిన్ వ్యతిరేక భావనతో మాట్లాడిందట. త్రిశూలం మూవీలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి స్మితను మూవీ టీం సంప్రదించగా.. ఆమె సినిమాను రిజెక్ట్ చేసిందట. రాఘవేంద్ర సినిమా అంటే హీరోయిన్స్ అశ్లీలంగా చూపిస్తారు. ఆయన డైరెక్షన్ లో నేను సినిమా చేయడం కుదరదు అంటూ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత జయసుధను పాత్ర కోసం ఎంపిక చేయడం.. శ్రీదేవి, జయసుధ, రాధిక హీరోయిన్స్ గా వ‌చ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలవడం జరిగింది. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కృష్ణంరాజు హీరోగా నటించారు. జయసుధ డి గ్లామర్ రోల్ చేయగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

Trisulam (film) - Wikipedia