“ఆ ఒక్క క్వాలిటీ చూసే పవన్ కళ్యాణ్ కు పడిపోయా”.. హీట్ పెంచేస్తున్న రేణు దేశాయ్ కామెంట్స్..!

పవన్ కళ్యాణ్ .. ఆ పేరులోనే ఓ తెలియని పవర్ ఉంటుంది. అందుకే ఆయనకు అంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ . సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలకి ఫాన్స్ ఉంటారు . ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు . ఒక్కొక్క హీరోది ఒక్కొక్క రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు మిగతా ఏ హీరోలు కూడా పనికిరారు అని చెప్పడంలో సందేహమే లేదు . ఆయనను ఓ హీరోలా కాకుండా ఓ దేవుడులా భావిస్తూ ఉంటారు . చాలామంది పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో తన కొడుకులకు పిల్లలకు ఆయన పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం .

పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఏదైనా నెగటివ్ పాయింట్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఆయన మూడు పెళ్లిళ్లు మేటర్ . మిగతా ఏ విషయంలో కూడా ఆయన వేలెత్తి చూపించలేదు. అంత నిక్కాస్ అయిన మగాడు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయి ని ప్రేమించిన విషయం తెలిసిందే . రేణు దేశాయ్ కూడా ఆయనను ప్రేమించింది . ఇద్దరు కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారు . బిడ్డ కూడా పుట్టాడు. అప్పుడే వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు . ఆ తర్వాత మరో పాప కూడా జన్మించింది . అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడిపోయారు .వీళ్ళు విడిపోయిన సరే వీళ్ళకి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది .

కాగా మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ఇష్టపడడానికి గల కారణాన్ని ఓపెన్ గా చెప్పేసింది. రేణు దేశాయ్ గతంలో మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ తాలూకా వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ..”తమ్ముడు సినిమా చేస్తున్న టైంలోనే పవన్ కి బద్రి సినిమాలో ఆఫర్ వచ్చింది. అప్పుడే నేను అడిషన్ ఇవ్వడానికి రామానాయుడు స్టూడియో కి వెళ్లాను . అక్కడ పెద్ద హడావిడిగా అంతా గజిబిజిగా ఉంది . అయితే నేను బహుశా హీరో వస్తున్నాడు ఏమో అనుకున్నాను . కానీ అప్పటికే హీరో అక్కడికి చేరుకునేసాడు .. ఆయన మరెవరో కాదు పవన్ కళ్యాణ్. అదేంటి ఈయన హీరోనా..? ఇంత సింపుల్ గా ఉన్నాడు ఏంటి అని అనుకున్నాను ..ఆయన సింప్లిసిటీ చూసే పడిపోయాను.. ఆ ఒక్క క్వాలిటీ పవన్ కళ్యాణ్ ను నేను ప్రేమించేలా చేసింది “అంటూ రేణు దేశాయ్ మాట్లాడింది . దాని తాలూకా వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు ఇప్పటికీ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ను పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తూనే ఉంటారు కొందరు ఆకతాయిలు..!!