తెలుగు ఇండస్ట్రీలో యోధుడు అంటే పవన్ కళ్యాణే.. ‘ హనుమాన్ ‘ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై హ‌నుమాన్‌ భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ‌ను కొల్లగొట్టి ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో రిలీజై మిట్ అందుకున్న టాప్ 1 మూవీగా రికార్డ్ సృష్టించింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాతో పోటీపడి స‌క్స‌స్ అందుకుంది. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో పాటు.. యంగ్ హీరో తేజ సజ్జ‌కు కూడా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే.

Prasanth Varma announces sequel of Hanuman, check the poster here | Entertainment News - Business Standard

తంవ‌ర‌లోనే ఈ సినిమా సీక్వెల్ కూడా సెట్స్ పైకి రానుంది. ఈ నేపథ్యంలో తేజసజ్జకు మ‌రిని సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక తేజ ఇటీవల ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మీరాయ్‌ పేరుతో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఓ ఈవెంట్లో పాల్గొన్న తేజ సజ్జ ప్రేక్షకులతో ముచ్చటించాడు. వారు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తేజ సజ్జను ప్రశ్నిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హీరో అంటే హనుమాన్ సినిమా తర్వాత నుంచి పిల్లలందరిలో హనుమాన్ పేరే వినిపిస్తుంది. అయితే గతంలో మీరు అన్నట్లు ఇండస్ట్రీలో హీరోస్ అంతా సూపర్ హీరోసే.

కానీ సూపర్ యోధ అనే టైటిల్ను ఎవరికైనా మన ఇండస్ట్రీలో వ్యక్తికి ఇవ్వాలనుకుంటే మీరు ఆ బిరుదు ఎవరికి ఇస్తారు అంటూ తేజను ఓ వ్య‌క్తి ప్రశ్నించారు. దీనికి తేజ సజ్జ స్పందిస్తూ నా దృష్టిలో అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ యోధుడు అంటే పవన్ కళ్యాణే. ఓజి గ్లింప్స్ చూసిన తర్వాత ఆ ఫాంట్‌.. ఆ పోస్టర్ క‌ళ్యాణ్‌గారి స్టైల్ తగ్గట్టు పవన్ కళ్యాణ్ కు సూపర్ యోధ అనే టైటిల్ అయితే బాగా సెట్ అవుతుంది అని నా ఒపీనియన్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తేజా సజ్జా చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. పవన్ అభిమానులు స్పందిస్తూ తేజ కరెక్ట్ గా చెప్పాడు. మా పవర్ స్టార్ నిజంగా ఒక సూపర్ యోధుడు అంటూ తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.