“వాళ్లను చూసైన నేను బుద్ధి తెచ్చుకుని ఉండాల్సింది”.. సమంత మాటలకు అర్ధాలే వేరులే..!!

సమంత .. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లలో ఈమె నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది . జనరల్ గా హీరోయిన్ అంటే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు . డాన్స్ చేస్తూ ఉంటారు . ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతుంటారు. అయితే ఉన్నది ఉన్నట్లు డైరెక్ట్ గా ఫేస్ మీదే మాట్లాడే ధైర్యం ఉన్న హీరోయిన్స్ చాలా చాలా తక్కువ ..వాళ్ళల్లో ఒకరే హీరోయిన్ సమంత. సమంత ఏదీ దాచుకోదు ..ఉన్నది ఉన్నట్లు బయటపెట్టేస్తుంది ..అది అందమైన ..కోపమైనా ..ప్రేమైనా ..ఏదైనా సరే అంటూ ఉంటారు అభిమానులు.

కాగా రీసెంట్గా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ షేర్ చేసింది . ఆ పోస్ట్ చూసిన జనాలు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సమంత కెరియర్ లోని ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ నటించిన ఊ అంటావ మావ పాటకు పిల్లలు తమదైన స్టైల్ లో స్టెప్స్ వేస్తూ చాలా ముద్దు ముద్దుగా గంతులు వేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది .

ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డాన్స్ కి ఫిదా అయిపోయింది . అంతేకాదు తగ్గేదేలే అంటూ పోస్ట్ కూడా చేసింది . “ఈ వీడియో చూశాక నాకు ఒకటి అర్థమైంది.. నేను ఇంకాస్త బెటర్ గా చేయాల్సింది..” అంటూ ఫన్నీ ఎమోజిలతో పాటు లవ్ సింబల్ ని షేర్ చేసింది . అయితే సమంత పాజిటివ్ గా స్పందించిన సరే ఈ వీడియో పై చాలా మంది సమంతను నెగటివ్ గా ట్రోల్ చేస్తున్నారు . వాళ్ళనైనా చూసి బుద్ధి తెచ్చుకొని ఉండాల్సింది కదా సమంత అంటూ పరోక్షకంగా తన డివోర్స్ మేటర్ ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు . ప్రజెంట్ సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది . ఆమె నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇంకా డేట్ అఫీషియల్ గా ప్రకటించలేదు..!