ఈ విషయంలో టాలీవుడ్ లో చాలామంది ప్రొడ్యూస‌ర్ల‌కన్నా దిల్ రాజు నిజంగా గ్రేట్.. అదేంటంటే..?!

ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో సినిమా అనేది లెక్కల ప్రకారం రన్నయ్యే ఒక కమర్షియల్ ఫార్ములా. ఓ సినిమా సక్సెస్ అయ్యిందా, ఫెయిల్యూర్ అయిందా అనే విషయాన్ని కేవలం కలెక్షన్లను బేస్ చేసుకుని అంచనాలు వేస్తున్నారు. మరి సినిమాకి డబ్బులు వస్తే తప్ప హిట్ అని ఒప్పుకోలేని పరిస్థితి. అలాంటి హిట్ సినిమా తీస్తేనే ప్రొడ్యూసర్ సక్సెస్ అందుకుంటాడు. కానీ సినిమా ఫెయిల్ అయితే దాని పూర్తి బాధ్యత ప్రొడ్యూసర్‌ది కాదు. కేవలం అది డైరెక్టర్ పైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్లాప్ సినిమాలు తీసే డైరెక్టర్ కి అవకాశాలు ఇచ్చే ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారు. కానీ దిల్ రాజు మాత్రం ఈ విషయంలో చాలామంది ప్రొడ్యూసర్ల కన్నా ఒక అడుగు ముందే ఉంటారు.

దిల్ రాజుకి సినిమా హిట్ అవ్వడం, ప్లాప్ అవడం విషయం కాదు. కేవలం తన ఇచ్చిన మాట కోసం ఎన్నోసార్లు ప్లాప్ అయినా సినిమా దర్శకులను అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. గతంలో వంశీ పైడిపల్లి ఎంతో నమ్మి మున్నా సినిమా అవకాశం ఇస్తే.. అది ఫ్లాప్ అయింది. అయినా వంశీ పై నమ్మకంతో మరోసారి దిల్ రాజు ఆయనకు సినిమా అవకాశం ఇచ్చాడు. దీంతో బృందావనం లాంటి హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో నటించేందుకు తారక్‌ను ఒప్పించి మరీ వంశీ పైడిపల్లికి దిల్ రాజు సినిమా ఛాన్స్ సెట్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఊపిరి, మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీరిద్దరి కాంబోలో వచ్చాయి. ఇప్పటికి వంశీ పైడిపల్లి తీసే ప్రతి సినిమాకు దిల్ రాజు ఏదో విధంగా సహాయ పడుతూనే ఉంటారు.

మ‌రొక‌రు వేణు శ్రీరామ్. ఈయ‌న కూడా దిల్ రాజు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అనడం సందేహం లేదు. ఆయన తీసిన అన్ని సినిమాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 2011లో వేణు శ్రీరామ్ మొదటి సినిమా తెరకెక్కించి యావ‌రేజ్ టాక్‌ అందుకున్నాడు. అయితే దాదాపు ఆరేళ్ల సమయం తర్వాత మళ్లీ దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఎంసీఏ సినిమాను రూపొందించాడు. దీంట్లో నాని హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓ మాదిరి హిట్గా నిలిచినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. ఇలా రెండుసార్లు సక్సెస్ అందకపోయినా వేణు శ్రీరామ్ కు మరోసారి వకీల్ సాబ్ సినిమాతో అవకాశం ఇచ్చారు దిల్ రాజు.

Parsuram's next project is not with Vijay Devarakonda - TrackTollywood

ఇది కలెక్షన్ల పరంగా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరో దర్శకుడు పరుశురాం విష‌యంతోను దిల్ రాజు ఇలాగే చేస్తున్నాడు. గీతాగోవిందం తర్వాత సర్కార్ వారి పాట సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్‌లో పరుశురామ్ తెరకెక్కించారు. దీని తర్వాత ఫ్యామిలీ స్టార్ పూర్తిస్థాయిలో కలెక్షన్ల పరంగా సక్సెస్ అందించలేదు. అయినా కూడా మరో సినిమాకు దిల్ రాజు పరుశురాంకు అవకాశం ఇచ్చారని తెలుస్తుంది. ఇక సక్సెస్, ఫెయిల్యూర్ కన్నా దిల్ రాజ్ ఆ వ్యక్తిపై ఉన్న నమ్మకంతోనే ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటాడని సన్నిహితులు చెబుతున్నారు.