ఫ్యాన్స్ సంతోషం కోసం ఆ పని చేయబోతున్న ప్రభాస్.. కెరియర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తెసి.. పడి దొర్లే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ప్రభాస్ మల్టీ స్టారర్ సినిమాలు చేయడు .. చేసిన కూడా ఆయన హీరోగా ఉండాలి .. ఆయనకు అలాంటి ఓ పిచ్చి ఎక్కువ అంటూ కొందరు ఆకతాయిలు ట్రోల్ చేశారు . అయితే వాళ్ళు నోరులు మూయించేలా ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నాడట.

 

గతంలో బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు ఇద్దరు హీరోలుగా నటించే సినిమాలో ప్రభాస్ వన్ అఫ్ ది హీరోగా సెలెక్ట్ అయ్యారట. ఆ సినిమా మరేదో కాదు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కే మూవీ . కోలీవుడ్ టాలీవుడ్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది ఈ వార్త. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే ఇది మామూలు సినిమా కాదని.. బిగ్ మల్టీ స్టారర్ సినిమా అని .. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నాడు అని ..ఇది కేవలం హీరో రోల్ నే కాదు అలా అని గెస్ట్ రోల్ కాదు ..ఈ సినిమా కథని మలుపు తిప్పే పాత్ర అని.. ఇలాంటి లుక్ లో ఇప్పటివరకు మనం ప్రభాస్ ని ఎప్పుడు చూడలేదు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ప్రభాస్ ఇలాంటి పెద్ద సాహసమే చేస్తూ ఉండడం గమనార్హం..!