కడుపుతో ఉన్నా కూడా ఆ పని చేస్తున్న దీపికా పదుకొనే.. హ్యాపీగా ఫీల్ అవుతున్న రణవీర్ సింగ్.. ఆదర్శ దంపతులు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారు కొంతమంది అందాల ముద్దుగుమ్మలు .. అయితే కేవలం తమ శారదా తీర్చుకోవడానికి.. డబ్బులు సంపాదించుకోవడానికి ..లైఫ్ లో చక్కగా ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆ హీరోయిన్స్ స్టేటస్ ని వాడుకుంటారు . కానీ కొంతమంది మాత్రం కమిట్మెంట్తో తమ ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి మరి షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు. ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే .

గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . హిందీ భాషలో పలు సినిమాలలో నటించి అందరి మనసులను దోచేసుకుంది. తెలుగు జనాలకి కూడా దీపికా పదుకొనే అంటే బాగా ఇష్టం . ఆమె యాక్టింగ్ స్టైల్ ను బాగా ఇష్టపడుతూ ఉంటారు . మనకు తెలిసిందే ప్రెసెంట్ దీపిక పదుకొనే ప్రెగ్నెంట్ . 2024 ఆగస్టులో ఆమె తన బిడ్డకు జన్మనివ్వబోతుంది . అయితే సాధారణంగా ఇలాంటి టైంలో కచ్చితంగా అందరు రెస్ట్ తీసుకుంటారు.

హీరోయిన్స్ కూడా చాలామంది అదే పని చేస్తారు . అయితే దీపికా పదుకొనే మాత్రం తన బేబీని రిస్క్ లో పెట్టి మరి షూటింగ్లో పాల్గొంటుంది. రోహిత్ శెట్టి చిత్రం సింగం అగైన్ సెట్స్ నుంచి కొన్ని పిక్చర్స్ బయటకు వచ్చాయి . ఈ పిక్చర్స్ లో దీపికా పదుకొనే బేబీ బంప్ తో కనిపించింది . ఇది చూసిన అభిమానులు షాక్ అయిపోతున్నారు. ఇలాంటి మూమెంట్లో కూడా షూటింగ్ అవసరమా..? అంటుంటే మరికొందరు కమిట్మెంట్ డెడికేషన్ అంటే అదే అంటూ పొగిడేస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ లుక్ లో అదిరిపోయింది దీపిక అంటుంటే మరి కొందరు హాట్సాఫ్ మేడం అంటూ పొగిడేస్తున్నారు . దీపికా పదుకొనేను ఈ రేంజ్ లో పొగడటం చూసి రన్వీర్ సింగ్ సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అంతేకాదు వీళ్ళను ఆదర్శ దంపతులు అంటూ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!