గతంలో సౌందర్య చేసిన అదే పని ఇప్పుడు చేస్తున్న సాయి పల్లవి.. ఈ విషయంలో వీళ్లను టచ్ చేసే వాళ్ళే లేరా..?!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో హీరోయిన్ సౌందర్య మొదటి వరుసలో ఉంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా.. డి గ్లామరస్ పాత్రల్లో ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలను నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానులను దక్కించుకున్న సౌందర్య.. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ వార్త యూత్ హార్ట్‌ బ్రేక్ చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఈ జనరేషన్ హీరోయిన్‌ సాయి పల్లవి కూడా సౌందర్యల తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను ఏర్పరచుకుంటుంది.

Sooryavansham Actress Soundarya Death In Plane Crash | sooryavansham  actress soundarya death in plane crash | HerZindagi

హోమ్లీ పాత్రలు మాత్రమే చేస్తూ.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం రామాయణ్‌లో సీత పాత్రను పోషించేందుకు సిద్ధమవుతుంది. నిజానికి సెలెక్టెడ్ క్యారెక్టర్లు మాత్రమే ఎంచుకుంటూ సినిమాల్లో నటించడం అనేది చాలా కష్టం. ఇక్కడ అవకాశాలు రావడమే చాలా కష్టంతో కూడిన పని.. అలాంటిది వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. కేవలం కంటెంట్ ఉంది వ‌ల్గారిటీ లేదనుకుంటే మాత్రమే ఆ సినిమాల్లో సాయిపల్లవి నటిస్తుంది. దీంతో ఆమెకు తెలుగులో మంచి పాపులారిటీ దక్కడమే కాదు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.

sai pallavi bollywood debut south actress to play sita in ramayana read  details | इस ब्लॉकबस्टर फिल्म से बॉलीवुड में डेब्यू करेंगी साउथ एक्ट्रेस  साई पल्लवी, माता सीता के अवतार ...

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో వస్తున్న రామాయణం సినిమాలో ఆమెను సీత పాత్రకి తీసుకుంటున్నారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకప్పుడు సౌందర్య చేసిన హోమ్లి.. ట్రెడిషనల్ పాత్రల తరహా పాత్రలోనే ఇప్పుడు సాయి పల్లవి కూడా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుత జనరేషన్లో ఈమె లాంటి హీరోయిన్ మరొకరు లేరు. ఈ విషయంలో సాయి పల్లవి, సౌందర్యాలను ఇప్పటి జనరేషన్ హీరోయిన్లు ఎవ్వరు టచ్ కూడా చేయలేరు అనడంలో సందేహం లేదు. ఫ్యూచర్‌లో సాయి పల్లవి నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగి.. మరిన్ని సక్సెస్‌లు సొంతం చేసుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.