“ఎప్పుడు.. ఏది.. జరగాలో అదే జరుగుతుంది”.. రెండో పెళ్లి పై మీనా సంచలన కామెంట్స్..!!

మీనా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం .. పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. తెలుగు – కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఈ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన్ హీరోయిన్ మీనా ప్రెసెంట్ సీనియర్ పాత్రనుల పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్గా హీరోయిన్ మీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది . ఈ క్రమంలోనే ఆమె తన రెండో పెళ్లిపై ఓపెన్ గా స్పందించింది .

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ మీనా రెండో పెళ్లి వార్త బాగా వైరల్ అవ్వడం చూసాం. ఆమెకు కోలీవుడ్ స్టార్ హీరో తో ఎఫైర్ ఉందని ..మరొక కన్నడ స్టార్ హీరోతో పెళ్లి జరగబోతుంది అని.. తన కూతురు భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని.. రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది మీన.

అసలు తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అంటూ తేల్చేసింది . “నా భర్త చనిపోతాడు అని నేను ఊహించలేదు.. అసలు ఆ బాధ నుంచి ఇంకా నేను బయటకు రాలేకపోతున్నాను. కానీ సోషల్ మీడియాలో మాత్రం నా గురించి ఏవేవో వార్తలు వైరల్ అవుతున్నాయి . హీరో ధనుష్ తో నాకు ఎఫైరా ..? ఎవరు చెప్పింది..? ఎలా రాసేస్తారు..? అలాంటి వార్తలు ..అసలు బుద్ధుందా..? అన్న రేంజ్ లో మండిపడింది “.

“అంతేకాదు ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది.. ఆ దేవుడు అన్ని డిసైడ్ చేసేస్తాడు.. నా భర్తకి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు.. దేవుడు ముందుగానే రాసేశాడు ..అదేవిధంగా నా లైఫ్ ఎలా వెళ్లాలో కూడా దేవుడు రాసేశాడు.. అదేవిధంగా జరుగుతుంది. దయచేసి నా రెండో పెళ్లి పై పిచ్చి పిచ్చి వార్తలు రాయకండి” అంటూ ఫైర్ అయింది. మీనా మాటలు చూస్తుంటే ఆమె జన్మలో రెండో పెళ్లి చేసుకునేటట్టు కనిపించడం లేదు అంటున్నారు అభిమానులు..!!