అల్లు అర్జున్ సినిమాలో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిన హీరో విశాల్‌.. ఏ మూవీలో అంటే..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ దక్కించుకుని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో దీనికి సీక్వల్‌గా వస్తున్న పార్ట్ 2 పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది. గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమాల్లో.. ఓ స్టార్ హీరోకు అవకాశం వచ్చింద‌ని.. అయ‌తేఆ సినిమాను హీరో రిజెక్ట్ చేశాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ విశాల్‌.

I Slept well during the Chennai floods" – Vishal (Exclusive Interview) - News - IndiaGlitz.com

గతంలో విశాల్ కు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమాను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి.. ఒకసారి తెలుసుకుందాం. నటుడు విశాల్‌ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుసగా తెలుగు యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు.. గతంలో ఆయన టాలీవుడ్ లో వదులుకున్న ఆసక్తికరమైన సినిమాల గురించి కూడా ప్రస్తావించాడు.

Varudu Movie (2010): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box  Office Collection – Filmibeat

అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో విశాల్‌కు నటించే అవకాశం వచ్చిందని.. అయితే ఆ సినిమాల్లో తనకు వచ్చిన పాత్ర మనసు అంగీకరించక రిజ‌క్ట్ చేశాన‌ని చెప్పుకొచ్చాడు. అలాగే విజయ్ హీరోగా లోకేష్ కనగ‌రాజ్‌ దర్శకత్వంలో లియో సినిమాలోను ఓ కీలక పాత్రను డేట్స్ అడ్జస్ట్ కాలేదని రిజ‌క్ట్ చేశాడ‌ట‌. అయితే విశాల్ అల్లు అర్జున్ వరుడు సినిమాలో ఆర్య పాత్రను రిజెక్ట్ చేశాడట విశాల్‌. ఇక ప్రస్తుతం విశాల్ హరి దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్‌లో ఈ నెల 26న రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం విశాల్.. వరుడు సినిమాలో ఛాన్స్ రిజ‌క్ట్ చేసాడ‌ని తెలియ‌టంతో ఆ సినిమాను వదులుకొని విశాల్ మంచిప‌నే చేశాడు అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.