ఈయనకి చిరంజీవి అంటే అంత ఇష్టమా..? 100సార్లకు పైగా బ్లడ్ డొనేట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ఇతడే..!

చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? చెప్పండి .. అఫ్ కోర్స్ కొంతమంది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. చాలా మంది ఆయన చేసే మంచి పనులను పొగిడేస్తూ ఉంటారు . మరి కొంతమంది ఆయన చేసే మంచి పనులకు సహాయంగా నిలుస్తూ ఉంటారు . తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే 26 ఏళ్లుగా లక్షలాది మందికి రక్త నిధులు ఉచితంగా దానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఎంతమందికి అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ వెళ్తుందో మనందరికీ తెలిసిందే . ఈ బ్లడ్ బ్యాంకు కి వెన్నుదన్నుగా నిలుస్తున్న లక్షలాది రక్తదాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ కూడా ఒకరు . ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1998 అక్టోబర్ రెండవ తేదీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్. కాగా రెండో వ్యక్తి మహర్షి రాఘవ కావడం విశేషం . అంతేకాదు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన దాదాపు 100 సార్లకు పైగానే బ్లడ్ డొనేట్ చేశారు .మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు మహర్షి రాఘవ .

మహర్షి రాఘవ 100 సార్లు బ్లడ్ డొనేట్ చేసి సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేశారు . చాలామంది మెగా అభిమానులు మెగాస్టార్ కి అభిమానులు గానే ఉంటారు కానీ ఇలాంటి అభిమానులు మాత్రం రేర్ గా ఉంటారు అంటున్నారు జనాలు . అంతేకాదు 100వసారి రక్తదానం చేసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆయనను సత్కరించారు . దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి, ఇలా రక్తదానం చేసిన వ్యక్తులలో మహర్షి రాఘవ ప్రప్రధముడని అభినందించిన చిరంజీవి ఆయన చేసిన గొప్ప పనికి ఎంత ఎన్ని సార్లు ధ్యాంక్స్ చెప్పినా సరిపోదు అంటూ పొగిడేసారు..!!