ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కించే సినిమా టైటిల్ ఇదేనా ..? పేరుతోనే సగం హిట్ కొట్టాడు పో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఏ సినిమాను చూస్ చేసుకున్న సరే అది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కేలా కన్ఫామ్ చేసుకుంటున్నాడు .ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత ది రాజా సాబ్ సినిమాను కూడా కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు .

అదేవిధంగా సలార్ 2 సినిమాను కూడా పెర్లర్ గా షూటింగ్ కంప్లీట్ చేసే విధంగా కాల్ షీట్స్ బుక్ చేసుకున్నాడు ప్రభాస్ . అయితే ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ప్రభాస్. హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో ప్రభాస్ ఓ క్రేజీ సినిమాకు కమిట్ అయ్యాడట. ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్న హను రాఘవపూడి ప్రభాస్ తో సినిమాని కన్ఫామ్ చేశాడు . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూడు పాటలు కూడా ఫినిష్ చేశామంటూ క్లారిటీ ఇచ్చారు . అయితే సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ వైరల్ గా మారింది . ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నాడట . హను రాఘవపూడి ఫౌజీ అంటే అర్థం సైనికుడు అని అయితే పూర్తి లవ్ రొమాంటిక్ సినిమా గా తెరకెక్క బోతుంది ఈ మూవీ అనుకునే లోపే హను రాఘవపూడి ఇలాంటిఓ నిర్ణయం తీసుకోవడం అభిమానులకి ఆశ్చర్యకరంగా ఉంది . టైటిల్ వెరైటీగా ఉండడంతో కచ్చితంగా సినిమాకి మంచి రీచ్ వస్తుందని ..సగం హిట్ అప్పుడే కొట్టేశాడు హను రాఘవపూడి అంటూ రెబెల్ ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు..!