“ఫ్యామిలీ స్టార్” లాంటి డిజాస్టర్ నుంచి తప్పించుకున్న ఆ లక్కీ తెలుగు హీరో ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ బలి..!

పరశురాం పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు అదేవిధంగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. డైరెక్టర్ పరుశురాంపెట్ల చాలా చాలా కష్టపడ్డారు . కానీ విజయ్ దేవరకొండ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి తూగడం లేదు అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమాను ఎంకరేజ్ చేయలేకపోయారు.

జనాలకి కూడా పెద్దగా నచ్చకపోవడంతో సినిమా డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. మొదటి రోజు కేవలం సింగిల్ డిజిట్ కలెక్షన్ సాధించడం విజయ్ దేవరకొండ కెరియర్ లోనే చెత్త రికార్డుగా నిలిచిపోయింది . అయితే ఇలాంటి ఓ డిజాస్టర్ మూవీ నుంచి తప్పించుకొని చాలా లక్కీగా మారిపోయాడు తెలుగు హీరో . ఆయన మరెవరో కాదు నాగచైతన్య .

నిజానికి గీతాగోవిందం సినిమా తర్వాత పరశురాం పెట్ల నాగచైతన్య తో అల్లు అరవింద్ నిర్మాణంలో ఒక సినిమా చేయాల్సి ఉండింది . అయితే కొన్ని కారణాల చేత ఆ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ తో తెరకెక్కించారట ఆ. ఫ్లాప్ సినిమా ఫ్యామిలీ స్టార్ కావడం గమనార్హం. నాగచైతన్య భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకున్నాడు అంటూ అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు..!