షడ్రుచుల ఉగాది పచ్చడితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. మిస్ చేసుకుంటే మీకే నష్టం..?!

కొత్త ఏడాదికి స్వాగతం చెప్తూ హిందువులు ఆనందంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ ఉగాది. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న (ఈరోజు) ఉగాది వేడుకలు పురస్కరించుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు సంవత్సరాది లో ఉగాదిని నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఉగాది అనగానే మొదట మన అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడిని చాలామంది కేవలం ఉగాది రోజు మాత్రమే చేసుకుంటారు.

అలాగే ఉగాది పచ్చడిని వ్యక్తి యొక్క భావోద్వేగాలను వ్యక్త పరుస్తుందని నమ్ముతారు. షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు ఈ ఆరు రోజులు కలిగిన ఉగాది పచ్చడి వ్యక్తి యొక్క భావోద్వేగాలకు ప్రతీక‌గా భావిస్తారు. సంప్రదాయబద్ధంగా చేసే ఉగాది పచ్చడిలో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కనుక ఉగాది పచ్చడిని మిస్ చేసుకుంటే మనకే నష్టం. ఇంతకీ ఉగాది పచ్చడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఈ పచ్చడిలో చేదు కోసం వేప పువ్వుని వాడుతారు. వేప పువ్వులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని సంగతి తెలిసిందే.

వేప పువ్వు రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరంలో మలనాలను తొలగించడానికి, జీర్ణ క్రియను ప్రోత్సహించడానికి, రుతుమార్పు వల్ల పిల్లల్లో వచ్చే ఆటలమ్మ, కలరా, మలేరియాస్, స్పోటకం లాంటి అంటువ్యాధులు సౌకకుండా కాపాడుతుంది. అలాగే ఉగాది పచ్చడిలో వ‌గరు కోసం మామిడి మొక్కలను ఉపయోగిస్తారు. మామిడి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు.. మధుమేహం ముప్పున తగ్గించడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహకరిస్తుంది. పులుపు కోసం వాడే చింత మన ఆరోగ్యానికి సహాయపడే పోషకాలను అందిస్తుంది. చింతపండులో ఉండే ఫ్లేవనోయిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంతోపాటు.. గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. చింత చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో కీలకపాత్ర వహిస్తోంది.

అదే సమయంలో అదనపు శెవ్‌ ఉత్పత్తికి చెక్ సె్టి.. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఇక తీపి కోసం ఉగాది పచ్చడిలో బెల్లం వాడతారు. బెల్లం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అంది.. తక్షణ శక్తి అందిస్తుంది. అలసట దరిచేరకుండా, రక్తహీనత కలగకుండా కాపాడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇప్పుడు డైజేషన్ ప్రాబ్లం, శరీరంలోని కణాల సక్రమంగా పనిచేసేందుకు ఎలక్ట్రోలైట్లు సమ‌తూల్య‌తను కాపాడేందుకు సహకరిస్తుంది. ఇక మిరపకాయను కారం కోసం వాడుతూ ఉంటారు. మన ఇంద్రియాలు అన్నిటిలోని మలినాలను బయటకు పంపేందుకు.. గొంతు వ్యాధులను తగ్గించేందుకు కారం సహకరిస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉగాది పచ్చడిని మీరు అస‌లు మిస్ కావొద్దు.