‘ హాయ్ నాన్న ‘ కు అవార్డుల జాతర.. అంతర్జాతీయ వేదికపై ఏకంగా 11 అవార్డ్ లతో..

నాచురల్ స్టార్ నాని హీరోగా హాయ్ నాన్న సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శౌర్యవ్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్ గా, బేబీ కియారా ఖ‌న్నా కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందింది.

ఇక‌ గ‌తేడాది డిసెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. కలెక్షన్ల పరంగాను నాని సినీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా రికార్డ్ సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హాయ్ నాన్న మూవీకి అవార్డుల జాతర మొదలైంది. తాజాగా హాయ్ నాన్న ఇంటర్నేషనల్ స్టేజ్ పై సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లో జరిగిన ది ఒనిరోస్ అవార్డ్స్ లో హాయ్ నాన్న సత్తా చాటుకుంది. ఏకంగా 11 విభాగాల్లో అవార్డులను దక్కించుకొని ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.

బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ పెయిర్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఫస్ట్ డైరెక్షన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ హాయ్ నాన్నకు అంతర్జాతీయ వేదికపై అవార్డులో అందాయి. ఒక్కసారిగా ఈ సినిమాకు అన్ని అవార్డులు రావడంతో.. దర్శకుడు శౌర్యవ్ తో పాటు మూవీ టీం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారడంతో నాని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. నాని ప్రస్తుతం వివేక్‌ కాత్రేయ డైరెక్షన్‌లో సరిపోదు శనివారం సినిమాతో మరో హిట్ అందుకునేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.