“ఆ విషయం నాకు ముందే తెలుసు”.. బిగ్ బాంబ్ పేల్చిన నయనతార..!

సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకునింది నయనతార. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు క్రియేట్ చేయించుకునింది . రీసెంట్గా సోషల్ మీడియాలో నయనతార మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వస్తుంది.

రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతారకు మీరు నటించిన సినిమాలు అన్ని హిట్ అవ్వడానికి కారణం ఏంటి..? అనే విధంగా హోస్ట్ ప్రశ్నిస్తారు . అయితే దీనికి సమాధానంగా నయనతార ఒక కథను విన్నప్పుడు అది జనాలకి నచ్చుతుంది.. నచ్చదు అన్న విషయాన్ని మనం కనిపెట్టేయొచ్చు ..నాకు ఆ విషయం ముందే తెలిసిపోతుంది ..అందుకే నేను చూస్ చేసుకునే సినిమాలు టాక్ అటు ఇటుగా ఉన్న జనాలకు బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాయి “అంటూ చెప్పుకు వచ్చింది .

అంతేకాదు షారుక్ ఖాన్ తో నటించిన జవాన్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేస్తూ షారుక్ ఖాన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి . ఆయనతో నటించడం ఓ ధ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మళ్లీమళ్లీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆయనతో నటిస్తాను అంటూ తెగేసి చెప్పేసింది . నయనతార మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!