తారక్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన చరణ్.. కారణం ఏంటంటే..?!

మెగాస్టార్ తన్న‌యుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న చెర్రీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. చిరుత సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమాలోని వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చెర్రీ. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్న చరణ్.. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

దీంతో పట్టే మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే గ‌తంలో ఎన్టీఆర్‌ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఓ సినిమాను చ‌ర‌ణ్ రిజెక్ట్ చేశాడంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. రాంచరణ్ ఆ సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తరికెక్కిన అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమా మొదట రామ్ చరణ్‌తో తీయాలని త్రివిక్రమ్ భావించాడట.

కానీ ఏవో అనివార్య కారణాలతో రామ్ చరణ్‌కు ఇష్టంలేక‌పోయినా ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. దీంతో ఈ కథ ఎన్టీఆర్ కు వినిపించాడట.. ఎన్టీఆర్ కి కథ నచ్చడం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. త్రివిక్రమ్ డైరెక్ష‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కి సక్సెస్ సాధించడం జరిగింది. కాగా త్రివిక్రమ్, రాంచరణ్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాకపోవడం గమనార్హం. ఫ్యూచర్లో ఒక మంచి కథతో వీరిద్దరి కాంబోలో సూపర్ హిట్ మూవీ రాబోతుందని సినీ వ‌ర్గాల స‌మాచారం.