ఆ టైం లో నరకయాతన అనుభవించా.. చచ్చిపోదాం అనుకున్నా.. పవర్ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటుల‌ ఆడంబరాలు మాత్రమే బయట ప్రపంచానికి కట్టినట్లుగా కనిపిస్తాయి. కానీ వారిలో చాలామందికి ఉండే కన్నీళ్లు కష్టాలు అంతర్గతంగా ఉంటాయి. చాలామంది ఎన్నో రకాల భయంకర వ్యాధులతో బాధపడుతూ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన‌ పడి నరకయాతన అనుభవించారు. ఇటీవ‌ల టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దానితో పోరాడి బయట పడిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్లలో నటి ముంతాజ్‌ కూడా ఒకటి. తెలుగు, తమిళ్‌లో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో ఖుషి, అత్తారింటికి దారేది సినిమాల్లో ఐటం గర్ల్‌గా మెరిసింది.

కోలీవుడ్ డైరెక్టర్ టి.రాజేందర్ తెరకెక్కించిన మోనిసా ఎన్ మోనాలిసా సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోకపోయినా.. ఆమె నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించి ఎవో కారణాలతో ఐటమ్ సాంగ్స్ లో నటించింది. శృంగార తారగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తమిళ్, తెలుగు తో పాటు కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరమయింది. చివరిగా రాఘవ లారెన్స్ రాజాధిరాజా సినిమాలో విలన్ రోల్ లో మెప్పించడంతోపాటు.. తెలుగులో మరో రెండు చిన్న సినిమాల్లోనూ మెరిసింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముంతాజ్ మాట్లాడుతూ.. తన వెన్నెముక భాగం కదలడానికి కూడా వీలుపడకుండా చాలా ఇబ్బంది పెట్టిందని.. ఆ నొప్పిని తట్టుకోలేకపోయాన‌ని వివరించింది. చాలామంది వైద్యులు పరీక్షించిన సమస్య ఏంటో చెప్పలేకపోయారని.. అలా రెండేళ్లపాటు నరకాన్ని అనుభవించానని చెప్పుకొచ్చింది. అయితే తర్వాత ఓ హాస్పిటల్ లో పరిశోధన చేయగా నాకు ఆటో ఇమ్యూన్‌ అనే అరుదైన వ్యాధి సోకిందని తెలిసిందని వివరించింది. ఈ వ్యాధి కారణంగా శరీరంలో ఎక్కడెక్కడ ఎముకల జాయింట్స్ ఉంటాయో.. ఆ ఏరియాస్ లో భయంకరమైన నొప్పి కలుగుతుందని చెప్పుకొచ్చింది. ఈ వ్యాధి కారణంగా కూర్చోలేక, నడవలేక, శరీరం కథల్చ‌లేక నరకయాత‌న‌ చూసానని.. మానసిక వేదనకు గురయ్యానని.. ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలిసేది కాదంటూ వివరించింది.

ఓసారి రెండున్నర గంటలసేపు నాన్ స్టాప్ గా ఏడ్చానని.. మానసిక వ్యాధిని అర్థం చేసుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చింది నా అన్నయ్యే అంటూ చెప్పుకొచ్చింది. ఆయన లేకుంటే నేను ఈపాటికి ఆత్మహత్య చేసుకునేదాన్ని వివరించింది. ఇక 43 వ‌య‌స్సు వ‌చ్చిన పెళ్ళి కాక‌పోవ‌డంపై ఆమె మాట్లాడుతూ.. గతంలో గ్లామర్ పాత్రల్లో నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నానని.. తన శృంగార భరిత ఫోటోలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని భావిస్తున్నానని.. అయితే ఆ పని నాకు సాధ్యం కావడం లేదు అంటూ వివరించింది. దయచేసి నా ఫ్యాన్స్ ఈ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ వేడుకుంది. నాకు నా వివాహం జరుగుతుందని నమ్మకం లేదని.. జరుగుతుందో.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే అంటూ ముంతాజ్ తన కష్టాలను వివ‌రిచింది.