ఆ సినిమా కోసం తారక్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా వెనక్కి ఇచ్చేశాడా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న లేటెస్ట్ న్యూస్..!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్.. ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వార్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఎన్టీఆర్.

అయితే నిజానికి ఎన్టీఆర్ 31 సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా మరింత ఆలస్యం కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేసాడట తారక్.

సినిమా స్టార్ట్ అయ్యాకే తీసుకుంటాను అంటూ మేకర్స్ కు క్లారిటీ ఇచ్చారట . దీంతో ఫాన్స్ కొత్త టెన్షన్ పడుతున్నారు. అసలు సినిమా ఉందా..? క్యాన్సిల్ అయిపోయిందా..? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఆగిపోయింది అని కొందరు ..పోస్ట్ పోన్ అవుతుంది అని మరికొందరు ప్రచారం చేస్తున్నారు . దీనిపై క్లారిటీ రావాలి అంటే టీం నోరు విప్పాల్సిందే. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!