యువరాజును కనిపెట్టక ముందు చాలా కప్పలను కిస్ చేశా.. తాప్సి సెన్సేషనల్ కామెంట్స్.. !!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలా సరసన నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వైవిధ్య‌మైన‌ పాత్రలను ఎంచుకుంటూ వ‌రుస‌ ఆఫర్లను అందుకుంటుంది. ఇటీవల డుంకీ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తన వ్యక్తిగత విషయానికొస్తే తాప్సి బ్యాడ్మింటన్ ప్లేయర్. మైథియాస్ బోయ్ తో దాదాపు 10ఏళ్ళ‌కు పైగా ప్రేమాయణం నడుపింది.

ఇటీవ‌ల‌ అఫీషియల్ గా ఈ విష‌యాని అనౌన్స్ చేసిన తాప్సి.. మార్చి 23న ఉదయపూర్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. దీనిపై ఎలాంటి ప్రకటన, పోస్ట్ కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోలేదు. అయితే సోషల్ మీడియాలో తాప్సి సంగీత్, పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తాప్సి మాట్లాడుతూ.. ఒకానొక టైం లో కప్పలని ముద్దు పెట్టుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను నా యువరాజును కనుగొనే ముందే.. ఎన్నో కప్పలను కిస్ చేయాల్సి వచ్చిందని.. నేను పూర్తిగా పరిపక్వత చెందిన తరువాత కావలసింది అబ్బాయి కాదు.. మనిషి అని అర్థం చేసుకున్నానని.. ఈ రెండిటిలో చాలా తేడా ఉంటుందంటూ వివరించింది.

అర్థం చేసుకునే పర్సన్స్ మాత్రమే మనం కోరుకున్న సెక్యూరిటీ, సంటెబిలిటి ఇవ్వగలరని ఫిక్సయ్యా అంటూ వివరించింది. అయితే నాతో ఉండ‌గ‌ల‌గాలంటే ఓ అబ్బాయి కాదు.. ఓ మగాడు అయ్యి ఉండాలి. ఊరికే ఎమోషనల్ అవ్వడం.. ఏడ్చేయడం, బ్లాక్ మెయిల్ చేసేయడం ఇలాంటివి చేసే వాళ్ళు నాకు సెట్ కారు. అలాంటి వాళ్ళ వల్ల నా కుటుంబం పైన, నా పని పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకే నా లైఫ్ కు సంబంధించిన ప్రతి విషయంలో నేనే డెసిషన్ తీసుకుంటా అంటూ వివరించింది. ప్రస్తుతం తాప్సీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో అంత ఆశ్చర్యపోతున్నారు.