తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే వెంటనే ఆ అలవాటు మార్చుకుంటారు..?!

చాలామందికి తిన్న వెంటనే కునుకు వేసే అలవాటు ఉంటుంది. ఆహారం సేవించడం వెంటనే బెడ్ రూమ్ కు వెళ్ళిపోయి నిద్రంచాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును వెంట‌నే ఆపేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వారు వివరిస్తున్నారు. ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిన్న‌ వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందట.

దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. రాత్రి భోజనం, వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తిన్న తర్వాత రెండు నుంచి మూడు గంటలు గ్యాప్ ఉండాలని.. డాక్ట‌ర్లు చెప్తున్నారు. రాత్రి భోజనం వెంటనే నిద్రించడం మధుమేహ సమస్యలకు దారితీస్తుందని.. మధుమేహం ఉన్నవారికి వాటి తీవ్రతను పెంచడానికి ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు.

ఈ అలవాటు కారణంగా బాడీలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని.. తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల మధుమేహంతో పాటు ఊబకాయం లాంటి వ్యాధులు కలిగే ప్రమాదం ఉంటుందని.. అలాగే జీర్ణవ్యవస్థలోను తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని.. డైజెష‌న్‌పై చెడు ప్రభావం కలుగుతుందని చెబుతున్నారు. దీని కారణంగా అజీర్ణం, ఎసిడిటీ, గుండెల్లో మంట లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే య‌సిడీటితో మీరు బాధపడుతున్నట్లయితే తిన్న వెంటనే నిద్రపోయే అలవాటును మానేయ‌టం మంచిది. దీనివ‌ల్ల నిద్రతో పాటు ఆరోగ్య సంబంధిత ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చు.