ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని సినిమాలలో నటించారో తెలుసా.. పాన్ వరల్డ్ లోనే ఆల్ టైం రికార్డ్..!!

టాలీవుడ్ సీనియర్స్ సినీ దిగ్గ‌జ న‌టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి రావడానికి మూల కార‌ణం ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్న సంగతి చాలామందికి తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరోలు ఇద్దరికీ మొదటి నుంచి ఒకరి సినిమాలతో ఒకరికి గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. పోటాపోటీగా విభిన్న కథలతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఇద్ద‌రు త‌మ స్టైల్‌లో సినిమాల‌లో న‌టిస్తూ తెలుగు సినీ ఖ్యాతికి కృషి చేశారు. అయితే వీరిద్దరూ కలిసి చాలా మల్టీ స్టార్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు స్టార్ హీరోలే అయినా.. ఎలాంటి భేదాలు, ద్వేషాలు లేకుండా ఎన్నో సినిమాల్లో కలిసినటించారు. అలా మొత్తంగా వీరిద్దరూ కలిసి 14 మల్టీ స్టారర్ సినిమాలలో నటించే భారీ హిట్లు అందుకున్నారు. 1950లో పల్లెటూరి పిల్ల సినిమాతో వీరిద్దరి కాంబో స్టార్ట్ అయింది.

అదే ఏడాది సంసారం సినిమాలోను వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత పరివర్తనం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చరణదాసి, మాయాబజార్, భూకైలాస్, గుండమ్మ కథ, శ్రీకృష్ణార్జునయుద్ధం, చాణుక్యచంద్రగుప్త, రామకృష్ణులు, సత్యం శివం సినిమాల్లో నటించి మెప్పించారు. అలా ఇప్పటివరకు ఇండియా మొత్తంలో మ‌రే ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి ఇన్ని మల్టీస్టార‌ర్‌ సినిమాల్లో నటించలేదు. దీంతో ఇప్పటికే వీరిద్దరూ నటించిన ఈ సినిమాలతో ఆల్ టైం పాన్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.