కల్కి సినిమాలో అనుష్క ..అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న నాగ్ అశ్వీన్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి సినిమాలో రెబల్ అభిమానుల ఫేవరెట్ హీరోయిన్ అనుష్క కనిపించబోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ప్రత్యక్షంగా కాదు పరోక్షకంగా అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి . దీపికా పదుకొనే హీరోయిన్గా దిశాపటాని మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అనుష్కతో కలిసి ప్రభాస్ నటించిన పాత తాలూకా సినిమా క్లిప్స్ ను కొన్ని యాడ్ చేశారట .

సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కామెడీ పండించడానికి నాగ్ అశ్వీన్ ఇలా డిజైన్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రజెంట్ కల్కి ది రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత స్పిరిట్ సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!